Home తెలంగాణ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల సంక్షేమం…

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల సంక్షేమం…

492
0
Distribution of free bus passes to desabled
Ramagundam MLA Korukanti Chander speaking at the distribution of free bus passes for the disabled

– పేదలకు భరోసాగా ‘విజయమ్మ పౌండేషన్‌’
– వికలాంగులకు ఉచిత బస్‌పాస్‌లు పంపిణీ…
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్‌ 18: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. రామగుండం ప్రాంతంలోని నిరుపేదలకు భరోసాగా విజయమ్మ పౌండేషన్‌ నిలుస్తోందన్నారు. ఈ మేరకు అదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయమ్మ పౌండేషన్‌ ఆధ్వర్యంలో 979 మంది వికలాంగులకు ఉచిత బస్‌ పాస్‌లు ఎమ్మెల్యే పంపిణి చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత నిరుపేదల కళ్లల్లో అనందం నింపడమే సిఎం కేసీఆర్‌ తన లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే వికలాంగుకులకు 3వేల రూపాయల పెన్షన్‌ అందించి వారికి అర్ధిక భరోసాగా ప్రభుత్వం నిలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే రామగుండం ప్రాంతంలో నిరుపేదల అండగా నిలిచేందుకు తాము తమ వేతనం నుండి విజయమ్మ పౌండేషన్‌ ద్వారా 25 శాతం పేద ప్రజల గురించి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.

Distribution of free bus passes
MLA Korukanti Chander distributing free bus passes to the disabled

ప్రజలకు ఉపయోగకరమైన పనులను నిర్వహిస్తున్నామని, వికలాంగులకు ఆదుకుంటు న్నామని, వారు చిరువ్యాపారాలు చేపడితే వారికి ఆసరాగా నిలుస్తామని చెప్పారు. రాష్ట్ర సంక్షేమశాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్‌ ద్వారా వికలాంగులకు కావాల్సిన సదుపాయలు అందిస్తామన్నారు. వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకు రావాలని, ఇబ్బందులు తొలగించేందుకు ఎల్లవేళల కృషి చేస్తామని తెలిపారు.

వికలాంగుల సౌకర్యార్ధం గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరన్‌ క్యాంపు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. వికలాంగుల పించన్లు, సదరన్‌ క్యాంపుల నిర్వహణ కోసం కార్పోరేటర్‌ కన్నూరి సతీష్‌ కుమార్‌ను కో-ఆర్డీనేటర్‌గా నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Distribution free bus passes
MLA Korukanti Chander distributing free bus passes to the desabled

ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌ కుమార్‌, కార్పోరేటర్లు కన్నూరి సతీష్‌ కుమార్‌, కుమ్మరి శ్రీనివాస్‌. దాతు శ్రీనివాస్‌, ఇంజపురి పులిందర్‌, దొంత శ్రీనివాస్‌, ఎన్‌.వి.రమణరెడ్డి, మంచికట్ల దయాకర్‌, కొమ్ము వేణుగోపాల్‌, ధరణి స్వరూప-జలపతి, కల్వచర్ల కష్ణవేణి భూమయ్య, కో-ఆప్షన్‌ సభ్యులు మహ్మద్‌ రఫీ, నాయకులు అడ్డాల రామస్వామి, నీల గణేష్‌, రాకం దామోదర్‌, సలీం బెగ్‌, గడ్డి కనుకయ్య, చెలకపల్లి శ్రీనివాస్‌, మండ రమేష్‌గౌడ్‌, బాలసాని స్వామిగౌడ్‌, కోంరయ్య, ఇందిరా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here