– మనవీయ కోణంలోనే సమస్య పరిష్కారం చేయాలి…
– డీసీపీ (అడ్మిన్) అశోక్‌కుమార్ ..
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 18: సేవలతోనే పోలీసులు ప్రజల మన్ననలు పొందుతారని రామగుండం పోలీసు కమిషనరేట్ డీసీపీ (అడ్మిన్) ఎన్.అశోక్‌కుమార్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాకు 137 మంది సివిల్, ఏఆర్, మహిళా కానిస్టేబుళ్లు రామగుండం పోలీసు కమిషనరేట్‌లో ఆదివారం రిపోర్టు చేశారు.
ఈ సందర్బంగా డీసీపీ అడ్మిన్ అశోక్‌కుమార్ నూతనంగా విధులు నిర్వహించనున్న పోలీసులనుద్దేశించి మాట్లాడారు. ప్రతి పోలీసు మానవీయ కోణంలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రిపోర్ట్ చేసిన పోలీసు సబ్బంది స్థలాలు, ఎడ్యుకేషన్ గురించి అడిగి తెలుసుకున్నామన్నారు.
ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సత్వర సేవలు అందించాలని, పోలీస్ స్టేషన్లకు వచ్చే వారిపట్ల గౌరవమర్యాద ప్రదర్శించాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా చెప్ప వచ్చు అన్నారు. సమస్యలు తెలియచేయడానికి పోలీస్ సిబ్బంది కోసం కమిషనరేట్‌లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాట్సాప్ నెంబర్ 6301754817 అని ఏదైనా సమస్య ఉంటే మెసేజ్ చేయవచ్చు అని తెలిపారు.
క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని రామగుండం కమిషనరేట్‌కు, తెలంగాణ పోలీసుకు మంచిపేరు తీసుకురావాలన్నారు. బయట డ్యూటీస్‌కి వెళ్ళినప్పుడు క్రమశిక్షణతో, మంచి ప్రవర్తనతో విధులు నిర్వహించాలని కోరారు. విధి నిర్వహణలో ఏదేని సమస్య తలెత్తితే అధికారులు తమ వెంట ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి (ఏఆర్) కమాండెంట్ సంజవ్, ఏసీపీ (ఏఆర్) సుందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నారాయణ, ఆర్‌ఐలు మధుకర్, శ్రీధర్, ఆర్‌ఎస్‌ఐ సంతోష్ పాల్గొన్నారు.