Home తెలంగాణ అన్నదాత అభ్యున్నతికి పెద్దపీట…

అన్నదాత అభ్యున్నతికి పెద్దపీట…

412
0
MLA Korukanti Chander speaking at the grain procurement center in Janagama
MLA Korukanti Chander speaking at the grain procurement center in Janagama

– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్‌, 13: తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. శుక్రవారం జనగామ గ్రామంలో వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రైతులు పడుతున్న కష్టాలను శాశ్వతంగా తొలగించాలనే సంకల్పంతో కాళేశ్వర ప్రాజెక్టును నిర్మించారన్నారు. బీడు భూములను సాగునీరు అందించి పచ్చని పొలాలుగా మార్చి రైతు కళ్ళలో వెలుగులు నింపిన రైతు బంధవు సీఎం కేసీఆర్‌ అని తెలిపారు. కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరినది నిండుకుండలాగా మారిందన్నారు.

MLA Korukanti Chander opening a grain purchasing center in Janagama
MLA Korukanti Chander opening a grain purchasing center in Janagama

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా రాష్ట్రంలోని రైతాంగానికి 24గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌, సకాలంలో ఎరువుల పంపిణి, రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తు రైతును రాజుగా మార్చేందుకు సిఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలు అర్ధిక ఇబ్బందులు ఎద్కుకొంటున్న సందర్భంలోనూ రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవద్దని, రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వం కోనుగోలు చేసిందని తెలిపారు. ప్రతి గ్రామంలో ధాన్య కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. దాన్యకోనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామన్నారు.

MLA Korukanti Chander weighing the grain
MLA Korukanti Chander weighing the grain

జనగామలో 402 మంది రైతులు 502 ఎకరాల్లో 21వేల టన్నుల వరి దాన్యాన్ని పండించండం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం దేశంలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు పంటను కోనుగోలు చేసిన దాఖలాలు లేవని కేవలం తెలంగాణ రాష్ట్రంలో పంటను కోనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌ కుమార్‌, కార్పోరేటర్‌ దాతు శ్రీనివాస్‌, ప్యాక్స్‌ చైర్మన్‌ మామిడాల ప్రభాకర్‌, నాయకులు తానిపర్తి గోపాల్‌ రావు, జనగామ నర్సయ్య, తోకల రమేష్‌, గనవెని సంపత్‌, ఇరుగురాళ్ల శ్రావన్‌, ముడుతనపల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here