– ఉనికి కోసమే టీఆర్‌ఎస్ పాట్లు
– రైతుల పట్ల టీఆర్‌ఎస్‌కు ప్రేమలేదు
– పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు…
– పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు సత్యనారాయణ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 9: తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం మంగళవారం రైతు చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయ లబ్ధి కోసమే అధికార పార్టీగా వుండి బంద్ నిర్వహించడం హాస్యాస్ప దంగా ఉందని పెద్దపెల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు సోమారపు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. బుధవారం శివాజీనగర్‌లోని బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ బంద్‌కు పోలీసులు పూర్తి మద్దతు ఇచ్చారని ఆరోపించారు. పోలీసుల బంద్‌లాగా వుందని సత్యనారాయణ పేర్కొన్నారు.
నరేంద్ర మోడీ రైతులకు మధ్య దళారుల బెడద పూర్తిగా పోయి నేరుగా రైతులు తమ ధాన్యాన్ని వినియోగదారులకు అమ్ముకునే చట్టాన్ని తీసుకురావడాన్ని ఎట్లా వ్యతిరేకిస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఈ బంద్ చేపట్టారని సత్యనారాయణ విమర్శించారు. బంద్‌లో పోలీసులు టీఆర్‌ఎస్ నాయకులకు సహకరించిన విధంగానే, విపక్షాలు కూడా బంద్ నిర్వహిస్తే వారికి సహకరించాలని ఆయన పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమిలేదని తెలిపారు.
బిజెపి రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎస్.కుమార్, బల్మూరి అమరేందర్‌రావు కేసీఆర్ ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కేవలం ప్రజలను మోసగించడానికి బంద్ నిర్వహించిందని పేర్కొన్నారు. రైతు చట్టాల పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఈ విలేకరుల సమావేశంలో రామగుండం కార్పొరేషన్ ఏరియా బిజెపి అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి ఆర్. దేవకర్ణ, మాజీ కార్పోరేటర్ కోదాటి ప్రవీణ్‌కుమార్, దక్షినమధ్య రైల్వే బోర్డు సభ్యులు క్యాతం వెంకటరమణ, మంచికట్ల బిక్షపతి, కోమల పురుషోత్తం, శ్రీధర్‌రావు, డేవిడ్ రాజు, మిట్టపల్లి సతీష్, జనగామ సాగర్, మామిడి వీరేశం, చంద్రశేఖర్ గౌడ్, భాష బోయిన వాసు, బుంగ మహేష్, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.