– కేంద్రం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలి
– వామపక్షాల నేతల డిమాండ్…
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 8ః కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట ఉరి తాల్లని వాటిని వెంటనే రద్దు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేసారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారత్ బందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు.
అనంతరం సీపీఐ, సీపీఎం సీపీఐ ఎం ఎల్ వామపక్షాలు నేతలు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణ బిల్లు రైతులకు తీవ్రమైన నష్టం కల్గుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ భారత దేశంలో 70% శాతం పైగా వ్యవసాయమే జీవనాధారమని, వ్యవ సాయంపై ఆదారపడి ఉపాది పోందే వారందరు తీవ్రంగా నష్టపోతారని, భారత పార్లమెంట్ ప్రజాస్వామ్య చరిత్రలో సెప్టెంబరు 20వ తేది దుర్దినంగా భావించవలసి ఉంటుందన్నారు తెలిపారు.
స్వామినాథన్ కమీషన్ సిపారసులు ననుసరించి రైతులకు మద్దతు ధర అమలుచేస్తామని ప్రదాని మోడీ ప్రకటించారు. అది ఉత్త మాటగానే మిగిలిపోయిందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు, నిత్యావసర ధరలు రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ ప్రయివేటు సంస్థలు దళారులు బ్లాక్ మార్కెట్లో ప్రజలను నిలువు దోపిడి చేస్తూ రైతులను తమ పోలాల్లో పాలేర్లుగా మార్చే దుర్మార్గమైన చట్థాలను కేంద్రం తీసుకొ చ్చిందని విమర్శించారు.
పరిశ్రమలకు ముడి సరుకులు అందిస్తున్న వ్యవసాయ రంగం కేంద్ర ప్రభుత్వం విధానాలతో సంక్షోభానికి కూరుపోయిందని తెలిపారు. లాక్ డౌన్ వల్లన మార్కెట్ల మూతపడి ఎగుమతులు స్థంబించిపోయినాయని, వీటికి తోడు ఆకాల వర్షలతో రైతులు పంటలను పూర్తిగా నష్టపోయారని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదుకొన్న పరిస్థితి లేదని తెలిపారు.
గ్రామీణాభివృద్ధి రైతు సాధికారత పేరుతో రెండవసారి అదికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం తన అసలు ముసుగు బట్టబయలైందని, బడా కార్పోరేట్ కంపెనీల కోసం వ్యవసాయ ఉత్పత్తులను కూడా కారు చౌకగా కట్టబేటేందుకు రైతు ఉత్పత్తుల వర్తక వాణిజ్య ప్రోత్సాహం సదుపాయలు సవరణ బిల్లు 2020, ధరలు హామి పంట సేవల అంగీకరణ సవరణ బిల్లు 2020, తృణ దన్యాలు చిరు దన్యాలు నిత్యావసర ఉత్పత్తుల సవరణ బిల్లు 2020 లాంటి మూడు బిల్లులను తీసుకోచ్చిందని పేర్కొన్నారు. ఈ బిల్లులు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశ పెట్టి ఆమోదించుకొన్న మోడి ప్రభుత్వం రాష్ట్రపతి అమోద ముద్ర వేయించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రదాని మోడి అంబానీ అదానీ సేవలో తరిస్తూ వ్యవసాయ రంగాన్ని విస్మరించారని విమర్శించారు.
ఇప్పటికే గ్రామాలలో నిరుద్యోగం మరింత పెరుగుతుందని, వలసలు, రైతుల ఆత్మహత్యలు ఎక్కవగా జరుగతున్నాయని, ఈ బిల్లు రైతుల పాలిటి ఊరితాళ్లు అవుతాయని ఆవేదన వ్యక్తం చేసారు. తక్షణమే ఈ బిల్లులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు కే.కనక రాజ్, మద్దెల దినేష్, మడ్డి ఎల్లయ్య, గౌతం గోవర్ధన్, వై, యకయ్య , వేల్పుల కుమారస్వామి, మహేశ్వరి, సాగర్, నాగమణి, కే.రాజన్న, ఈదునూరి నరేష్, తికల రమేష్, మరియు ప్రజాసంఘాల నాయకులు రెనుకుంట్ల ప్రీతం, వానపాకల విజయ్, కరీం, సురేష్, సాగర్, శనిగారపు చెంద్ర శేఖర్, చంద్రయ్య, తీరుపతి తో పాటు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.