Take a fresh look at your lifestyle.

జాతీయ పార్టీ అభ్యర్థిగా లేదా ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేయనున్న…..డాక్టర్.బి. కేశవులు 

0 1,269

 నిజామాబాద్   లోక్ సభ నియోజకవర్గం నుంచి

జాతీయ పార్టీ అభ్యర్థిగా లేదా ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేయనున్న…..డాక్టర్.బి. కేశవులు

  • నిజామాబాద్ నుంచి తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ ….డాక్టర్ కేశవులు పోటి !

నిజామాబాద్, ఫిబ్రవరి 18 ( లోకంతీరు ) :  ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పొలిటికల్ ట్రేడ్ మారిపోతుంది. ఇంతవరకు రాజకీయాలతో ఏ మాత్రం టచ్ లేని డాక్టర్లు, మేధావులు, ఎన్నారైలు ఒక్కసారిగా డైరెక్ట్ గా ఎన్నికల బరిలోకి దూకడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు, గతంలో తటస్తులకు కొన్ని పార్టీలు ఎన్నికల వేళ అవకాశాలిచ్చి గెలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి, మళ్లీ అదే ట్రెండు కొనసాగబోతున్నట్లు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పలు పార్టీల నుంచి 12 మందికి పైగా డాక్టర్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో చాలా మంది డాక్టర్లు రాజకీయ అరంగేట్రం చెయడానికి ఉత్సాహము చూపుతున్నారు. ఆ కోవకు చెందిన ప్రముఖుల్లో ప్రస్తుతం తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ గా ఉన్న డాక్టర్.బి. కేశవులు సైతం నిజామాబాద్  లోక్ సభ నియోజకవర్గం నుంచి జాతీయ పార్టీ అభ్యర్థి లేదా ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేయడానికి ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నట్లు తెలిసింది.

సామాజిక సేవల్లో ముందంజ….

డాక్టర్ బి కేశవులు వైద్య వృత్తినీ ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎండీ పట్టాను పొంది నిజామాబాద్ కేంద్రంగా డాక్టర్.కేశవులు హాస్పిటల్ పేరున సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కేశవులు వద్దకి ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ , మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలు తండోప తండాలుగా వస్తారు. తెలంగాణలో సీనియర్ మానసిక వైద్య నిపుణులుగా తెలంగాణ మలి దశ ఉద్యమ కాలము నుంచి ఆత్మహత్య నిరోధక కమిటీ కన్వీనర్, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం కమిటీ కన్వీనర్,బాబా రాందేవ్ సత్యాగ్రహ కమిటీ కన్వీనర్ గా భారీ ఎత్తున ఉద్యమాలు చేసిన డాక్టర్ కేశవులు ప్రస్తుతము తెలంగాణ మేధావుల సంఘం మరియు జాతీయ మత్తు పదార్థాల సంస్థ చైర్మన్ గా పని చేస్తున్నారు, మద్యం, మత్తుపదార్థాల సేవనం వల్ల జరుగుతున్న అనారోగ సమస్యలు, డ్రగ్స్ పేరిట జరుగుతున్న దోపిడీ, డ్రగ్స్ వల్ల చెడి పోతున్న యువత గురించి అవగాహన కోసం పత్రికలలో పలు కథనాలు కూడా రాశారు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అవినీతిపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ చేస్తున్నారు, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతిపై పలు పత్రికలలో కథనాలు కూడ వ్రాశారు, గత ప్రభుత్వ పెద్దల నుంచి బెదిరింపులు వచ్చినప్పటికీ భయపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటం కూడా చేస్తున్నారు, కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ వైద్యము, కార్పొరేట్ మాఫియా గురించి సోషల్ మీడియాలో ప్రజలకు అవగాహన కూడా కల్పించారు. పేరొందిన డాక్టర్ కేశవులును రాజకీయాల్లోకి తీసుకురావడానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయం లో పలు పార్టీలు ప్రయత్నించాయి. అప్పుడు ఎవ్వరికి చిక్కకుండా తటస్థంగా ఉండిపోయారు.

మెజారిటీ ఓటర్లు పద్మశాలిలే కావడం …

ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలలో బిసి వర్గాలు ఎక్కువగా ఉండడం అందులో పద్మశాలి ఓటర్లు భారీగా ఉండడం తెలిసిందే, అంతే కాకుండా జిల్లాలో డాక్టర్ కేశవులు అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అందరికీ సుపరిచితులైన కామన్ మ్యాన్ డాక్టర్ గా పేరు తెచ్చుకొని సాదా సీదాగా జీవనం సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దగ్గరి కుల బంధువులు. స్నేహితులు, పరిచయాలు భారీగా ఉండటమే కాకుండా నిజాయితీ పరుడైన వైద్యునిగా ప్రజల్లో ముఖ్యంగా యూత్ లో భారీ క్రేజీ ఉండటం అతనికి కలిసి వచ్చే అంశంగా విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు. దేశం కొరకు, సామాజిక న్యాయం కొరకు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, సాధారణ మానవుడు సైతం పార్లమెంటులో కూర్చునే అవకాశం పొందాలనే తపనతో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశించిన సమానత్వము ,సామాజిక న్యాయం, వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకాలనే ఎజెండాతో రాజకీయాల్లో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు డాక్టర్ కేశవులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.