Home Uncategorized సింగరేణిలో ప్రమాదాల నివారణకు పటిష్టంగా రక్షణ…

సింగరేణిలో ప్రమాదాల నివారణకు పటిష్టంగా రక్షణ…

856
0
Peddapalli MP Venkatesh Netha speaking at meeting
Peddapalli MP Venkatesh Netha speaking at meeting

– అభివృద్ధి, భద్రత, సంక్షేమంపై ఇల్లందు క్లబ్‌లో సమీక్ష
– పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్‌ 12, సింగరేణిలో ప్రమాదాల నివారణకు మరింత పటిష్టంగా రక్షణ చర్యలు చేపట్టాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్‌ నేత పేర్కొన్నారు.రామగుండం రీజియన్‌ స్థాయి పబ్లిక్‌ గ్రివెన్స్‌, లా అండ్‌ జస్టిస్‌ రివ్యూ మీటింగ్‌ గోదావరిఖని ఇల్లెందు గెస్ట్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైన్స్‌ సేప్టీ పార్లమెంటరీ కన్సల్టేటివ్‌ కమిటీ సభ్యులు, పబ్లిక్‌ గ్రీవెన్స్‌ లా అండ్‌ జస్టిస్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు వెంకటేశ్‌ నేత ముఖ్య అతిధి హాజరయ్యారు. సింగరేణి గనుల అభివృద్ధి, రక్షణ, సంక్షేమంపై చర్చించారు.

ఈ సందర్బంగా ఎంపీ వెంకటేష్‌ నేతకాని మాట్లాడుతూ గని ప్రమాదాలను తగ్గించేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని సింగరేణి అధికారులకు సూచించారు. సంక్షేమం, రక్షణ, అభివద్ధి బాటలో సింగరేణి సంస్థ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు సింగరేణి సంస్థ పురోగమిస్తుందన్నారు.

Peddapalli MP Venkatesh Netha participating in review meeting
Peddapalli MP Venkatesh Netha participating in review meeting

మైన్స్‌ సేఫ్టీ పార్లమెంటరీ కన్సల్టేటివ్‌ కమిటీ సభ్యులు, పబ్లిక్‌ గ్రీవియన్స్‌ లా అండ్‌ జస్టిస్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా తన పరిధిలో సింగరేణి గనుల అభివద్ధి, రక్షణ సంక్షేమంపై ఈ ప్రత్యేక సమీక్షా సమావేశాలను నిర్వహించడం జరిగిందన్నారు. కొత్త గనులకు అను మతులు, రక్షణ పెంపుదల తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తన వంతుగా సహకారం అందించడానికి కృషి చేస్తానన్నారు. సంక్షేమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన అనేక హామీలను సింగరేణి అమలు జరపడం సంతోషకరమని, వీటిని మరింత విస్తత పరచడానికి, రక్షణ, అభివద్ధిపై తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై చర్చించడానికి ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెంకటేష్‌ నేత తెలిపారు.

రామగుండం రిజియన్‌ లో కార్పోరేట్‌ ఆసుపత్రి నెలకొల్పాలి

Ramagundam MLA Korukanti Chander speaking at meeting
Ramagundam MLA Korukanti Chander speaking at meeting

ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ సింగరేణి పర్మినెంట్‌ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులు గనుల్లో పనులు చేస్తున్నారని, వారికి సరైనా రక్షణ కల్పించడం లేదన్నారు. కార్మికుల రక్షణలో సింగరేణి యాజమాన్యం శ్రద్ధ వహించాలని, వారికి సరైనా వేతనాలు అందించాలన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పై గత అసెంబ్లీ సమావేశంలో ప్రస్తవించడం జరిగిందన్నారు.

సింగరేణి ఏరియాల్లో గతంలో సింగరేణి ఆధ్వర్యంలో పాఠశాలు నిర్వహణ జరిగేదని, నేడు ఎలాంటి పాఠశాలు సింగరేణి యాజమాన్యం నిర్వహించడం లేదన్నారు. సింగరేణి యాజ మాన్యం ఎన్టీపీసీ యాజమాన్యం ఏర్పాటు చేసిన తరహా కె. వి పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలకు ఆత్యవసర చికిత్సల కోసం రామగుండం రిజీయన్‌ పరిధిలో కార్పోరేట్‌ ఆసుపత్రిని సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు. కార్మికుల రక్షణే లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Singareni Officials and Union Leaders participating
Singareni Officials and Union Leaders participating

ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ వీఆర్‌ఎస్‌ కార్మికులకు సింగరేణ మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ అందడం లేదన్నారు. నైపుణ్యం గల ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నందున కొత్త నైపుణ్య కార్మికులను తీసుకోవాలన్నారు. సింగరేణి ఆసుపత్రిలో సరైన చికిత్స అందడం లేదని తెలిపారు. అన్ని రకాల యంత్ర విడిభాగాలు అందుబాటులోకి తీసుకోవాలని పేర్కొన్నారు. గోదావరిఖని మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సహకారం అందించాలని తెలిపారు.

అనంతరం డైరెక్టర్‌ (పా & ఆపరేషన్స్‌) వివరణ ఇస్తూ రక్షణ మరియు సంక్షేమంపై రాజీపడటం లేదని తెలిపారు. సంస్థ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా వున్న రక్షణ, సంక్షేమానికి వెనకాడటంలేదని తెలిపారు. కోవిడ్‌ నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలతో పాటు కార్మికులకు మెరుగైన వైద్యం అందించామని తెలిపారు. వివిధ సూచనలపై తగు విధంగా చర్చించి తర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో జడ్‌.పి. చైర్మన్‌ పుట్ట మధుకర్‌, రామగుండం యం.యల్‌.ఎ. కోరుకంటి చందర్‌, రామగుండం మేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌, పెద్దపల్లి జిల్లా ఇంఛార్జి జిల్లా కలెక్టర్‌ భారతి హోలికేరి, డిజీయం యస్‌.శ్యామ్‌ మిశ్రా, సింగరేణి డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌, ఎన్‌.బలరావ్‌,ు గుర్తింపు కార్మిక సంఘం నేతలు వెంకట్రావు, రాజిరెడ్డి, హెచ్‌.యం.యస్‌ నాయకుడు రియాజ్‌ అహ్మద్‌, గనుల అధికారులు, సింగరేణి అభివద్ధి, రక్షణ, సంక్షేమం విభాగాల జి.ఎం.లు, రీజియన్‌ సమావేశంలో జనరల్‌ మేనేజర్లు, గనుల రక్షణ, సంక్షేమ అధికారులు, రామగుండం రీజియన్‌ సమావేశంలో ఆర్‌.జి.-1,2,3 జియంలు కల్వల నారాయణ, సురేష్‌, సూర్యనారాయణ, సేప్టీ జియం వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్‌.జి రీజియన్‌ సేఫ్టీ క్వాలిటీ జీయంలు టి.వి.,రావు, సురేందర్‌, భూపాలపల్లి ఏరియాల జనరల్‌ మేనేజర్లు, గనుల రక్షణ, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here