– అన్ని ఏరియాల జియంలకు సింగరేణి సిఅండ్ఎండి ఎన్.శ్రీధర్ ఆదేశం
(ప్రజాక్ష్యం ప్రతినిధి – హైదరాబాద్)
సెప్టెంబర్ 3: బొగ్గుకు డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, నిర్ధేశిత లక్ష్యాను సాధించాలని సింగరేణి సీఅండ్ఎండీ ఎన్. శ్రీధర్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సీఅండ్ఎండి, సంస్థ డైరెక్టర్లు, అడ్వయిజర్లు, అన్ని ఏరియా జీఎంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రావాణా, కరోనా పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ సింగరేణి ద్వారా బొగ్గు స్వీకరిస్తున్న పరిశ్రమల నుండి బొగ్గుకు డిమాండ్ పెరుగుతున్నందున బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్ని ఏరియా జియంలను ఆదేశించారు. సెప్టెంబర్ రోజుకి లక్షా 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యంగా పనిచేయాలని జియంలను కోరారు. అలాగే అక్టోబర్‌లో లక్షా 50వే టన్నుల, నవంబర్‌లో లక్షా 60 వేల టన్నుల నుండి లక్షా 80 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి, రవాణా చేస్తూ యధాస్థితికి చేరుకోవాలని కోరారు.
ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్ తవ్వకాలు మరింతా పుంజుకోవాలని, సగటున రోజుకి 13 లక్ష క్యూబిక్ మీటర్ల ఓబిని తొగించాలని ఆదేశించారు. కొత్త ఓసి గనుల్లో బొగ్గు ఉప్పత్తి లక్ష్యాల మేర రావాలని కోరారు. రామగుండం-1 ఏరియాలో ప్రారంభించనున్న జిడికె-5 ఓసి గనికి సంబంధించిన అన్ని రకాల అనుమతులను వెంటనే పూర్తి చేసి జనవరి నెలలో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా సన్నాహాలు ముమ్మరం చేయాలని కోరారు. వినియోగదారలతో సింగరేణి కొనుగోలు ఒప్పందాలను చేసుకోవాని బొగ్గు స్టాకులు ఎక్కడా లేకుండా ఉత్పత్తి అయిన బొగ్గు మొత్తం రావాణా జరిగేలా మార్కెటింగ్ శాఖ కృషి చేయాని ఆదేశించారు.
కరోనా నియంత్రణకు దేశంలో ఏ ఇతర బొగ్గు కంపెనీ చేయని విధంగా సింగరేణిలోనే ఎక్కువ సంఖ్యలో ర్యాపిడ్ టెస్టులు, మందుల కొనుగోలు, ప్రత్యేక వైద్య సేవలతో పాటు గనుల్లో కానీలల్లో పెద్దఎత్తున కరోనా నియంత్రణ చర్యులు చేపట్టామనీ, వీటిని ఇంకా పటిష్టంగా కొనసాగించాలని ఆదేశించారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదనీ, ఒక వేళ క్షణాలు ఉంటే వెంటనే కంపెనీ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకొని పాజిటివ్ వచ్చిన వారు క్వారంటైన్‌లో వైద్య సేవలను పొందాలని కార్మికులకు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కొత్తగా ప్రారంభం కానున్న ఓసి గనులకు అవసరమైన అన్ని అనుమతులను తీసుకొని పనులు ఇంకా వేగవంతం చేయాని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో సియండితో పాటు డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) ఎన్. చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పీ.పీ) ఎన్.బలరామ్, ఇడి కోల్‌మూమెంట్ జె. అల్విన్, అడ్వయిర్ (మైనింగ్) డి.ఎన్. ప్రసాద్, అడ్వయిజర్ (ఫారెస్ట్రీ) కె.సురేంద్రపాండే, జిఎం (సిడిఎస్) కె. రవిశంకర్ అన్ని ఏరియాల నుండి జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.