– నివాళి అర్పించిన సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్
– అంతిమయాత్రలో పలువురు పట్టణ ప్రముఖులు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
సెప్టెంబర్ 2: ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య పార్థీవ దేహానికి అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. ఆనారోగ్యంతో హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుప్రతిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందారు. ఆయన పార్థీవ దేహాన్ని గోదావరిఖని పట్టణం కాకతీయనగర్ లోని మాతంగి ఇంటివద్ద ప్రజల సందర్భనార్ధం వుంచారు. రాష్ర్ట సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆయన నివాసానికి వెళ్లి పార్థీవ దేహంపై పుష్పగుచ్చం వుంచి ఘనంగా నివాళులు అర్పించారు. కటుంబసభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మేయర్ అనిల్ కుమార్, జడ్పిటీసీ కందుల సంధ్యారాణి, అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ, డిప్యూటి మేయర్ అభిషేక్ రావు, మాజీ మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, గుమ్మడి కుమారస్వామి, బిజెపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు నత్యనారాయణ, కార్పోరేటర్లు మహంకాళి స్వామి, కొమ్ము వేణు, బొంతల రాజేష్ నాయకులు తానిపర్తి గోపాల్ రావు, పాతిపెల్ల ఎల్లయ్య, బొడ్డు రవీందర్, అడ్డాల రామస్వామి, అడప శ్రీనివాస్ తో పాటు పలువురు నివాళులు అర్పించి ఆయన ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
దళితులకు దైర్యం ఇచ్చిన మహానాయకుడు మాజీ మంత్రి మాతంగి నర్సయ్య
దళితలకు దైర్యం ఇచ్చిన మహానాయకుడు మాజీ మంత్రి మాతంగి నర్సయ్య అని రాష్ట్ర సంక్షేమశాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి మాతంగి నర్సయ్య నివాసానికి వెళ్లి ఆయన పార్థీవ దేహంపై పుష్పగుచ్చం వుంచి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి మాతంగి మృతి తమను కలచి వేసిందని, సుధీర్ఘ రాజకీయాల్లో అందరితో కలిసిమెలసి ఉండేవారన్నారు. ఆయన 40 సంవత్సరాల నుండి సుపరిచితులు, అనుభవంలో పెద్దవారని, బిఎస్సి, ఎల్.ఎల్.బి చదువుకొని బ్యాంకు ఉద్యోగిగా జీవితం ప్రారంభించి మంత్రి స్థాయికి ఎదిగారన్నారు. ఈ ప్రాంతం నుండి శాసన సభ్యులుగా గెలిచి అనేక సమస్యలను పరిష్కరించి దళితులకు దైర్యం చెప్పిన మహానేత అని కొనియాడారు. మాజీ మంత్రి మాతంగి అంత్యక్రియలు ప్రభుత్వ లంఛానాలతో నిర్వహించాలని తాము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విన్నవించి, ప్రభుత్వ లంఛానాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహణకు ఏర్పాటు చేశామన్నారు.