– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజలక్ష్యం విలేకరి – రామగుండం నియోజకవర్గం)
సెప్టెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల, కుర్మ కులస్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అదివారం అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామంలో మేకల, గొర్రెల మార్కెట్ స్థల చదును కార్యక్రామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గోల్ల, కుర్మ కులస్థులకు సబ్సీడిపై గోర్రెలను అందిస్తు ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులకు ప్రోత్సాహం అందించడమే కాకుండా వారిని అర్ధికంగా అదుకుంటున్నారని తెలిపారు. మేకల గొర్రెల మార్కెట్ ను త్వరలోనో ప్రారంభిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అంతర్గాం ఎంపిపి దుర్గం విజయ, జడ్పీటిసి అముల నారాయణ, వైస్ ఎంపిపిలు మట్ట లక్ష్మీ-మహేందర్ రెడ్డి,ఎర్రం స్వామి, సర్పంచ్ శ్రీనివాస్, రామగుండం నగర డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, జిల్లా జడ్పీ కో అప్షన్ సభ్యులు దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి అర్ధిక సహాయం
అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామానికి చెందిన గోడిసెల నర్సయ్య ఇటీవల మృతి చెందాడు. మృతుడు నిరుపేద కావడంతో విజయమ్మ పౌండేషన్ ద్వారా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 5వేల రూపాయలు మృతుని భార్యకు అందించారు. మృతుడి పిల్లల చదవు బాధ్యత తానే తీసుకుంటానని, వారికి చదవు చెప్పిస్తామని తెలిపారు. అన్ని విధాలుగా ఆ కుటుంబానికి సహాయ సహాకారాలు అందిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే వెంట ఎంపిపి దుర్గం విజయ, జడ్పీటిసి అముల నారాయణ, వైస్ ఎంపిపి మట్ట లక్ష్మీ-మహేందర్ రెడ్డి, రామగుండం నగర డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు కోల సంతోష్, సారయ్య, తిరుపతి, మూల సంతోష్, అవునూరి రాజేష్ ఉన్నారు.