– నిండుకుండలాగా మారిన గోదావరినది
– పర్యటక హబ్ గా గోదావరినది తీరం
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 13: తెలంగాణ వ్యవసాయ రంగానికి సాగునీరు అందించే మహసంకల్పంతో రాష్ట్ర మఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అపర భగీరథ ప్రయత్నం సఫలంతో గోదారికి జలకళ సంతరించుకుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అదివారం గోదావరినది వద్ద అడ్వెంచర్ అండ్ అక్పా టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోట్ డ్రైవింగ్, లైఫ్ గార్డ్, రెస్యూ ఆపరేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు సీమాంధ్ర పాలనతో ఎండిన గోదావరినది దర్శనమించిందని, కాళేశ్వర ప్రాజెక్టు ఎత్తిపోతల ద్వారా గోదావరినది పొడుగునా సముద్రాన్ని తలపించే విధంగా నిత్యం నిండుకుండాలాగా మారిందన్నారు. జలకళ సంతరించుకున్న గోదావరినదిపై విజయవంతంగా పడవల పోటీలు నిర్వహించడం జరిగిందని, గోదావరినది తీరం పర్యటక హబ్ గా మారుతుందన్నారు.
బెస్త, ముదిరాజ్ మత్యకారులకు కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంతో మత్యసంపద పెరిగి వారికి ఉపాధి మార్గాలు పెరిగాయన్నారు. అడ్వెంచర్ అండ్ అక్వా టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోట్ డ్రైవింగ్, లైఫ్ గార్డ్, రెస్యూ ఆపరేషన్ శిక్షణ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో నగర డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్ దాతు శ్రీనివాస్ నాయకులు తోడేటి శంకర్ గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, పీచర శ్రీనివాస్, జహీద్ పాషా, ఆడప శ్రీనివాస్, గోలివాడ ప్రసన్నకుమార్, బస్వరాజు గంగరాజు, ఇరుగురాళ్ల శ్రావణ్, మేకల అబ్బాస్,బూరుగు వంశీకృష్ణ, కేశవగౌడ్ తదితరులు
పాల్గొన్నారు.