(ప్రజాలక్ష్యం విలేకరి – రామగుండం నియోజకవర్గం)
సెప్టెంబర్ 10: రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం రాయదండిలో పంచాయతి కార్యాలయం, మహిళ భవనం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్ధిని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. గురువారం హైదరాబాదులో మంత్రిని ఎమ్మెల్యే కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రికి వివరిస్తూ అంతర్గాం మండలం రాయదండి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం, కమ్యూనిటి హాల్ నిర్మాణం కోసం డి.ఎం.ఎఫ్.టి. ద్వారా నిధులు మాంజూరు కావడం జరిగిందన్నారు. రాయదండి గ్రామంలో రెవెన్యూ శాఖకు చెందిన భూమి లేకపోవడంతో నిర్మాణాలు మెదలు కాలేదని వివరించారు. రాయదండి గ్రామంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన 1 ఎకరం 28 గుంటల భూమి ఉందనీ అందులోని 20 గుంటల స్థలాన్ని భవనాల నిర్మాణానికి కేటాయించాలని కోరారు. దీనిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్థలం కేటాయింపుపై సానుకూలంగా స్పందించి సంబంధిత కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాయదండి సర్పంచ్ ధర్మాజీ కృష్ణ ఉన్నారు.