– దుర్గామాత దీవెనతో ప్రజలు సంతోషాలతో జీవించాలి
– సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
– ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 17: అమ్మ దయ వుంటే అన్నీ వున్నట్లేనని రాష్ట్ర సంక్షేమశాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు తెలిపారు. అమ్మ వారి నవరాత్రుల్లో భాగంగా శనివారం గోదావరిఖని పట్టణంలో దుర్గాదేవి ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లేనని రైతులకు పంటలు సమద్ధిగా పండి అధిక దిగుబడులు రావాలని, సింగరేణి గని కార్మికులు విధుల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అమ్మవారు అశీర్వాదించాలన్నారు. లోకకళ్యాణార్ధం దుర్గాదేవి అమ్మవారి ఆలయాన్ని నిర్మించామని, అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మకృపకు పాత్రులు కావాలన్నారు. సకల జనులందరు దుర్గామాత ఆశ్సీసులతో సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు పాతపెల్లి లక్ష్మీ-ఎల్లయ్య, ఎన్.వి. రమణరెడ్డి, నాయకులు అడ్డాల రామస్వామి, కాల్వ శ్రీనివాస్, అచ్చెవేణు, మోతుకు దేవరాజ్, ఆడప శ్రీనివాస్, మండ రమేష్ గౌడ్, బోమ్మగాని తిరుపతిగౌడ్, తిరుపతినాయక్, శ్రీనివాస్ రెడ్డి, కోట రవిగౌడ్, ఇరుగురాళ్ల శ్రావన్, మేకల అబ్బాస్,బూరగు వంశీకష్ణ, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.