(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 17: రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను సింగరేణి ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సింగరేణి సంస్థలో చేపట్టే జీడీకే.5వ ఓసీపీ పనులను గురించి తెలిపారు. సంస్థలో కార్మికులు, ఉద్యోగులకు అమల వుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రి ఈశ్వర్ అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా కరోనా పరీక్షలు, నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలు, వైద్య సదుపాయాల గురించి చర్చించారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు, సింగరేణి అధికారులు కూడా మంత్రిని కలిశారు.