– ఆర్జీవన్ జియం కె.నారాయణ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, మార్చి 25ః కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్ (సి.పి.ఆర్.ఎం.ఎస్.) నాన్ ఎగ్జిక్యూటీవ్ కు సంబందించిన మెడికల్ కార్డ్ ల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆర్జీవన్ జి.యం. కె. నారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు.
పదవి విరమణ పొందిన మాజీ సింగరేణి ఉద్యోగులు దరఖాస్తులను మార్చి 31, 2021 లోపు తమ తమ గనులు మరియు డిపార్ట్ మెంట్లలో సమర్పించాలని తెలిపారు. చివరి అవకాశం ఇస్తున్నట్లు ఆయన వివరించారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని తప్పని సరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సింగరేణి వ్యాప్తంగా సి.పి.ఆర్.ఎం.ఎస్ – (నాన్ ఎగ్జిక్యూటీవ్) పథకం ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. ఈ పథకంలో ఉధ్యోగ పదవీ విరమణ పొందిన వారు రూ.40 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకునే సౌలభ్యం కల్పించిందని చెప్పారు. ఈ పథకంలో చేరడం వల్ల విశ్రాంత ఉద్యోగికి మరియు ఆతని జీవిత భాగస్వామికి కంపెనీతో ఒప్పందం చేసుకున్న కార్పొరేట్ ఆసుపత్రులలో రూ. 8 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య సేవలు పొందవచ్చని తెలిపారు.