(ప్రజాలక్ష్యం విలేకరి-రామగుండం నియోజకవర్గం) :
గోదావరిఖని, సెప్టెంబర్ 19: రామగుండం నగరపాలక సంస్థ పరిధి 11వ డివిజన్ టీఆర్‌ఎస్ నూతన కమిటిని శనివారం నియమించారు. పట్టణ కమిటీ ఇంచార్జీ తోడేటి శంకర్ గౌడ్, డివిజన్ ఇంచార్జీ వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో నూతన కమిటి నియామకం చేపట్టారు.
11వ డివిజన్ అధ్యక్షునిగా ఎరుకల శ్రీహరి, మహిళా అధ్యక్షురాలిగా అనుముల కళావతి, యూత్ అధ్యక్షులుగా వడ్డేపల్లి క్రాంతి కుమార్, బిసి అధ్యక్షుడిగా గండు వెంకటేశ్వర్లు, సీనియర్ సిటిజన్ అధ్యక్షునిగా దాసరి ఎల్లయ్యను నియమించారు.