– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 19: కారోనా మహమ్మారి పట్ల ప్రజలందరు నిర్లక్ష్యం వహించవద్దని, అప్రమత్తంగా వుండి, కారోనా రక్షణ చర్యలు విధిగా పాటించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆయన మాట్లాడారు.
ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు దరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా సోకకుండా చూసుకోవాలన్నారు. ఈ నెల 21వ తేదిన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఓల్డ్ అశోక్ టాకీస్ వద్ద ఉచితంగా మాస్కులు, శానిటైజర్స్ పంపిణి చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, సాంగటి శంకర్, నాయకులు నీల గణేష్, దుర్గం రాజేష్, అచ్చెవేణు, బంక రామస్వామి, రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు.