– ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 13: భారతదేశ సంస్కతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళోత్సవాలు నిర్వాహణ చేపట్టడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని మెదర్ బస్తీలో ఓ ఫంక్షన్ హాల్లో విజయమ్మ ఫౌండేషన్, రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం సౌజన్యంతో తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భారతీయ సంస్కతి, సాంప్రదాయాల కళోత్సవాలకు సంబంధించిన సాంస్కతిక బందాల ఎంపిక కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ … రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంస్కతి సాంప్రదాయాలు కళోత్సవాలు నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కళోత్సవాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కాళోజీ రచనలు, కవితలు తెలంగాణ ప్రజనీకాన్ని చైతన్యం చేశాయని, ఆయన ఎంతో మందికి స్ప్షుర్తిదాయకంగా మారారనీ అన్నారు. గోదావరిఖని ప్రాంతం కళలకు కళాకారులకు పుట్టినిల్లు అని ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి కళాకారులు తమ ప్రతిభను కనబర్చి ఈ ప్రాంతానికి కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్, కార్పొరేటర్లు ధాతు శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, తానిపర్తి గోపాల్రావు, మ్యాజిక్ రాజా, దయానంద్ గాంధీ, మామిడాల ప్రభాకర్, సంగ రాజేశం, దామెర శంకర్, అమరేందర్, అందె సదానందం, ముడుతనపల్లి సారయ్య , ఇరుగురాళ్ల శ్రావన్, తదితరులు పాల్గొన్నారు.