(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్, 13: రామగుండం-ఎన్‌టిపిసి ధన్వంతరి ఆసుపత్రిలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రామగుండం-ఎన్టీపీపీ 43వ వార్షికోత్సవాన్ని పురస్క రించుకొని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు ఎన్టీపీసీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌టిపిసి, సిఐఎస్‌ఎఫ్‌కు చెందిన 17 మంది రక్తాన్ని దానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్టీపీసీ సీజీఎం సునీల్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో రక్తదానం చేసిన వారిని అభినందిచారు. ఈ రక్తదాన శిబిరాన్ని గోదావరిఖని ఏరియా హాస్పిటల్ సిబ్బంది సమన్వయం చేసింది.

ఈ కార్యక్రమంలో ఎన్‌టిపిసి సీనియర్ అధికారులు, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది దీప్తి మహిళా సంఘ సభ్యులు, వివిధ సంఘాలు, యూనియన్ సభ్యులు, సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది, ఎన్ట్టీపిసి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.