(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 16: రామగుండం ట్రాఫిక్ ఏసీపీగా బాలరాజు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991వ సంవత్సరంలో ఎస్సైగా పోలీసు డిపార్ట్‌మెంటులోకి వచ్చిన పసల బాలరాజు ఇన్‌స్పెక్టర్‌గా వివిధ పోలీస్ స్టేషన్‌లలో విధులు నిర్వహించారు.
డీఎస్పీగా పదోన్నతిపై అసిఫాబాద్‌లో కొంతకాలం సేవలు అందించి, అక్కడి నుంచి బదిలీపై తెలంగాణలోనే ప్రతిష్టాత్మక విద్యాలయం ట్రిపుల్-ఐటి బాసరలో సంవత్సరానికి పైగా సేవలు అందించారు. బాసర నుంచి రామగుండం ట్రాఫిక్ ఏసీపీ గా బాలరాజు ట్రాఫిక్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు, పెద్దపల్లి, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఉపేందర్, ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, ట్రాఫిక్ సిబ్బంది ఏసీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు.