– తిరుగులేని రాజకీయ శక్తి టిఆర్ఎస్…
– ఆసాధ్యంను సుసాధ్యం చేసిన సీఎం కేసీఆర్
– తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ పార్టీ
– రామగుండం ప్రజల సేవకే జీవితం అంకితం
– కార్పోరేషన్ వీలిన గ్రామాలకు విముక్తి కలిగించాం
– అభివృద్దే ప్రధాన ఎజెండాగా పాలన
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 16ః తెరాస అంటే ఒక ధైర్యం… ఒక భరోసా… రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తి టిఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తుందని రామగుండం ఎమ్యెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం గోదావరిఖని పట్టణంలోని విశ్వం కమ్యూనిటీహాల్ లో 5ఇంక్ష యిన్ పట్టణ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ పార్టీ నిండి ఉందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం తన ప్రాణాలను సైతం లేక్క చేయకుండా ఆసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కతుందని తెలిపారు. ఆయన నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో పనిచేయడం మన అదృష్టమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని తెరాస కార్యకర్తలను కంటికి రెప్పాలగా కపాడుతూ భరోసా కల్పిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో అలుపెరగని పోరాటంలో ఎన్నో కేసులు, ఎన్నో కష్టాలను ఎద్కుకొని తెలంగాణ సాధించికున్నామన్నారు. రామగుండం ఎమ్మెల్యేగాఎన్నికైనా నాటి నుండి నిత్యం ప్రజాక్షేత్రం లో ప్రజల అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం చేస్తున్నామని తెలిపారు.
రామగుండం ప్రజల సేవకే తన జీవితం అంకితం చేశామని, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తు పనిచేశామన్నారు. కార్పోరేషన్లో వీలినమైన కుందనపల్లి, లింగపూర్, వీర్లపల్లి, బద్రిపల్లి గ్రామాలను తిరిగి గ్రామ పంచాయితిగా మార్చామని తెలిపారు.
రామగుండం నియోజవర్గం అభివృద్దే ప్రధాన ఎజెండాగా పాలన సాగిస్తున్నమన్నారు. ప్రతి డివిజన్ లో పార్టీని సంస్తాగత నిర్మాణం చేయడం జరిగిందని, 9 కమిటీలతో 100 మంది నాయకులను ఎన్ను కోవడం జరిగిందని తెలిపారు. గులాభీ సైనికులకు ఏ కష్టం వచ్చిన అండగా ఉండి అదుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు సాగంటి శంకర్, దోంత శ్రీనివాస్, బోడ్డు రజిత, జంజర్లమౌనిక, చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు పాత పెల్లి ఎల్లయ్య, రాకం వేణు, జే.వి.రాజు, తోడేటి శంకర్ గౌడ్, దుర్గం రాజేష్, నారాయణదాసు మారుతి, అచ్చె వేణు, ఇనుముల కళావతి, కుడుదుల శ్రీనివాస్, దాసరి ఎల్లయ్య, కృష్ణస్వామి, గాండ్ల సునిల్, వడ్డేపల్లి క్రాంతి, పిడగు కుమార్, కృష్ణస్వామి, సమ్మారావు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.