(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 11: గోదావరిఖని పట్టణం స్దానిక జి.ఎంకాలనీ గ్రౌండ్ లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారధ్యంలో విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు కన్నుల పండుగగా జరిగాయి.
నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ విజయమ్మ పౌండేషన్ అధ్యక్షుడు కోరుకంటి మణిదీప్, కోరుకంటి ఉజ్వల ఈ బతుకమ్మ సంబురాలకు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రామగుండం నియోజకవర్గంలోని విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు.
అనంతరం బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించారు. న్యాయ నిర్ణేతలుగా రంగజ్యోతి, డాక్టర్ లక్ష్మివాణి వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాల్వ స్వరూప, వేగోళపు రమాదేవి, పోన్నం విద్య శీరిష, కో ఆప్షన్ సభ్యులు తానిపర్తి విజయలక్ష్మి, తస్నీభాను నాయకులు అచ్చే వేణు, నూతి తిరుపతి, చల్ల విజయలక్ష్మి, చల్లా రవీందర్ రెడ్డి బతుకమ్మ సంబురాల కో ఆర్డినేటర్ దయానంద్ గాంధీ, తానిపర్తి గోపాలరావు విజయమ్మ పౌండేషన్ భాధ్యులు ఎడెల్లి శ్యాం తదితరులు పాల్గొన్నారు.
8 వ ఇంక్లైన్ కాలనీ లో
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారధ్యంలో విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ సంబురాలు మంగళవారం 8 వ కాలనీ సి.ఈ.ఆర్ క్లబ్ లో నాలుగవ రోజు ఘనంగా జరిగాయి. మహీళమణులంతా ఉయ్యల పాటలతో ఉత్సహంగా ఆడి పాడారు.
రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, విజయమ్మ పౌండేషన్ అధ్యక్షుడు కోరుకంటి మణిదీప్ ఈ బతుకమ్మ సంబురాలకు ముఖ్య అతిథులుగా హజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి కి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని అన్నారు. పూలను పూజించే సంస్కృతి తెలంగాణ ఆడబిడ్దలదన్నారు. రామగుండం నియోజకవర్గం లోని విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
అనంతరం బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించారు. న్యాయ నిర్ణేతులుగా రంగజ్యోతి, లావణ్య వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సాగంటి శంకర్, శంకర్ నాయక్, బాదే అంజలి, తాళ్ల అమృతమ్మ ,నీల పద్మ టూటౌన్ C.I శ్రీనివాస్ రావు, నాయకులు తానిపర్తి గోపాల్ రావు, నీల గణేశ్, ఆయులి శ్రీనివాస్, మేడి సదయ్య, ఎరవెల్లి గోపాల్ రావు, గూడేల్లి రాంచెందర్, విజయ చంద్రశేఖర్, అనుముల కళవతి, దీటి బాలరాజ్, బైరి నాగమణి, నాంసామి ఓదేలు, వంశీకృష్ణ, శంకర్ నాయక్, మాల్లారెడ్ది, పోయుల సంపత్, ఓరయగంటి కళావతి, ముద్దసాని సంధ్యా రెడ్డి, నల్లా మధుకర్ రెడ్డి, మాచర్ల వంశీ, ప్రశాంత్ గౌడ్ ఇరుగురాళ్ల శ్రావన్ మనోజ్ యాదవ్, కుమార్ యాదవ్, ముక్కెర మెగిళి, రహీం, నాగరాజు, లక్ష్మీ బతుకమ్మ సంబురాల కో ఆర్డినేటర్ దయానంద్ గాంధీ, విజయమ్మ పౌండేషన్ భాధ్యులు ఎడెల్లి శ్యాం శాంతలక్ష్మి, ఇందు తదితరులు పాల్గొన్నారు.