(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 28: ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని భాస్కరరావు భవనోలో భగత్ సింగ్ 114వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కలవేన శంకర్, ఏఐటీయూసీ నాయకులు వై గట్టయ్య, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు, ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు జల్లి ప్రజలను చైతన్య పరిచి, బ్రిటిష్ గుండెల్లో రైలు పరిగెత్తించిన విప్లవ వీరకిశోరం అని అన్నారు. విద్యార్థి, యువత భగత్ సింగ్ ఆశయాలను కొనసా గించాలని వారు అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శులు తాళ్లపల్లి మల్లయ్య, మద్దెల దినేష్, మడ్డి ఎల్లాగౌడ్, కె.రాజారత్నం, టి రమేష్ కుమార్,ఏఐఎస్‌ఎఫ్ కార్పొరేషన్ అధ్యక్ష కార్యదర్శులు రేణుకుంట్ల ప్రీతం, ఈర్ల రామ్‌చందర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు వనపాకల విజయ్, జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి సురేందర్, నగర కార్యదర్శి శ్రీకాంత్, సురేష్, సాగర్, అవినాష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.