– మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 28: కాంగ్రెస్ నాయకులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించడం అప్రజాస్వామికమని రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు, విధానాలపై గవర్నర్‌కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసే విధంగా తీసుకున్న 3 జీవోలకు వ్యతిరేకంగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని వమ్ము చేసే విధంగా, రైతు లేనిదే రాజ్యం లేదనేటువంటి భారతదేశ చరిత్రను కాలరాసే పద్ధతిలో బిజెపి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని మక్కాన్ పేర్కొన్నారు.
టిపిసిసి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్చార్జ్ మాణికం ఠాగూర్, ఏఐసీసీ సెక్రటరీలు శ్రీనివాస్ కష్ణణ్, బస రాజు, ఎంపీలు రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ తదితర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం అమానుషమన్నారు.