(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 5: ప్రధానమంత్రి ఆత్మా నిర్భర్ భారత్ పథకం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మంధిరంలో బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మా నిర్భర్ భారత స్కీం క్రింద వీధి విక్రయదారులకు స్ట్రీట్ వెండర్స్ కింద ఒక్కొక్కరికి 10,000/-ల చొప్పున ప్రతి నెల వాయిదాల పద్ధతిలో సక్రమంగా కట్టిన యెడల సబ్సీడీ కింద రీ పెమెంట్ గా వారి ఖాతాకు నగదుగా జమ అవుతుందని ఆయన అన్నారు. వీధి విక్రయదారులకు పి.ఎం. స్వానిధి స్కీం కింద కూరగాయలు, పండ్లు వివిధ రకముల పనులను, వివిధ రకాల వ్యాపారాలను, జి.సి.ఎల్ లోన్స్, ఎన్.పి.ఎల్ లోన్స్ మంజూరు చేసి మరల తిరిగి వసూలు చేయాలని ఆయన తెలిపారు. ధరఖాస్తులు ఎక్కువగా వచ్చే విధంగా వీధి విక్రయదారులను ప్రోత్సహించాలని, ధరఖాస్తులను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ ఆత్మా నిర్భార్ నిధి ఈ పథకం ఎప్పటికప్పుడు రుణాలు మంజూరు అయ్యే విధంగా చూడాలని ఆయన అన్నారు. పి.ఎం. స్వానిధి, (ఆత్మా నిర్భార్ నిధి), స్ట్రీట్ వెండర్స్ లోన్ పి.ఎం. ఆత్మా నిర్భర్ భారత్ నిధి, జి.ఈ.సి.ఎల్. ఎం.ఎస్.ఎం.ఈ, ప్రస్తుతం తీసుకున్న రుణాలపై 20 శాతం పెంచి ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ స్కీం లు చిన్నా,సన్నాకారు రైతులకు ఉపయోగపడే విధంగా చూడాలని అన్నారు. ఈ స్కీం లకు సంబంధించి అన్ లైన్ యాప్ యాప్ pmsvanidhi.mohua.gov.in ద్వారా మీ సేవలో ప్రజలు ధరఖాస్తులను క్రాస్ చెక్ చేసి ఐండెంటిఫికేషన్ చేయాలని అధికారులను, బ్యాంకు అధికారులను ఆదేశించారు. లోన్ ధరఖాస్తులు అప్ లోడ్ అయ్యే విధంగా చుడాలని, బ్యాంకులో ఖాతా ఉన్న వారికి నగదు జమ అవుచున్నదని, ఖాతా లేని వారికి కొత్త ఖాతా ను ఓపెన్ చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అంకిత్, వ్యవసాయాధికారి శ్రీధర్, జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీయేట్ నవీన్ కుమార్, పి.డి. రవీందర్, డి.ఎం.సి. శ్రీవాణి, (మెప్మా) ఎల్.డి.యం. లక్ష్మణ్, బ్యాంకులకు సంబంధించిన బ్యాంకు మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.