-100 కోట్ల డోసుల కోవిడ్ వాక్సిన్ మైలు రాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా
-11 వ వార్డులో వాక్సిన్ సెంటర్ లో వైద్య సిబ్బందికి సన్మానం
-మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
ప్రజాలక్ష్యం ప్రతినిధి, హుస్నాబాద్, అక్టోబర్ 20 : ఈ రోజు BJP రాష్ర్ట పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం కరోన వ్యాధి నిర్మూలనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తలపెట్టిన వ్యాక్సినేషన్ యజ్ఞం నేటితో దేశంలో 100 కోట్ల డోసుల మైలు రాయిని పూర్తి చేసుకున్న సందర్బంగా నేడు హుస్నాబాద్ పట్టణంలోని 11వ వార్డ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ లో కోవిడ్ వ్యాధి నిర్మూలనలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది.
అదేవిధంగా దేశ ప్రజలందరికీ ఉచిత వాక్సిన్ అందిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరియు పట్టణములో టీకా వేయించు కొనని వారికి టీకా విశిష్టత అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణు యాదవ్, సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి గుత్తికొండ విద్యాసాగర్,సీనియర్ నాయకులు కొత్తపల్లి అశోక్, BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని సతీష్,మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట స్వరూప,పట్టణ ప్రధాన కార్యదర్శి తోట సమ్మయ్య, కార్యదర్శి భోగ మహిష్కర్, యువ మోర్చా అధ్యక్షుడు బొప్పిశెట్టి భీమేశ్వర్,ప్రధాన కార్యదర్శి ఎగ్గొజు సాగర్,నాయకులు ప్రతాపగిరి రామ్ ప్రతాప్,ఎదులాపురం నవీన్,శ్రీకాంత్ మరియు తదితరుల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.