– టీఆర్‌ఎస్ నాయకులవి పసలేని ఆరోపణలు…
– పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి) :
గోదావరిఖని, సెప్టెంబర్ 24, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తుందని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో పసలేదని, భారతదేశంలో కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేవలం 290 కోట్ల ఇచ్చిందన్న టిఆర్‌ఎస్ నాయకులు అనడం అవివేకమని పెద్దపెల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు సోమవారం సత్యనారాయణ టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఈ మేరకు గురువారం గోదావరిఖని శివాజీనగర్‌లోని బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కరోనా విపత్తు సమయంలో రైతుల ఖాతాల్లో 666 కోట్లు, మహిళల జన్‌ధన్ ఖాతాల్లో 778 కోట్లు, దివ్యాంగులు వితంతువులు వద్ధాప్య పింఛన్లకు 60 కోట్లు, ఆరున్నర కోట్లు భవన నిర్మాణ కార్మికులకు, 124 కోట్లు పిఎఫ్ విత్ డ్రా, 741 కోట్లు ఉద్యోగులకు కేంద్రం చెల్లించిన పిఎఫ్, 29 కోట్లు పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్లో మూడు విడతల్లో 1964 కోట్లు, పది లక్షలకు పైగా జనాభా గల నగరాలకు 105 కోట్లు నిధులు, 15 లక్షల లోపు జనాభా గల నగరాలకు 502 కోట్ల నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన తొమ్మిది వందల ఇరవై మూడున్నర కోట్లు, ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు 14,56,670 అని, అలాగే 4,56,046 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారని వివరించారు.
అలాగే కరోనా నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందించిన వెంటిలేటర్లు 1400 మాస్కులు 14 లక్షలు, మూడు లక్షల కిట్స్ అందజేయడం జరిగిందన్నారు. కేంద్రము నుండి ఇన్ని కోట్ల నిధులను తీసుకొని కేవలం 290 కోట్ల ఇచ్చిందని సిగ్గు మాలిన మాటలు మాట్లాడుతున్నారని దయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలో తగిన గుణపాఠం చెబుతారని ఆయన విమర్శించారు.
అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన రైతుల ఉత్పత్తుల వర్తక వాణిజ్యం బిల్లు అలాగే ధరల హామీ సేవల అంగీకార బిల్లు మరియు నిత్యావసర ఉత్పత్తుల సవరణ బిల్లు వాటి అంశాలను వివరంగా పాత్రికేయులకు తెలియజేశారు.
ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ ఏరియా బిజెపి అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు , నియోజకవర్గం ఇంచార్జ్ మారం వెంకటేశం, కార్పొరేటర్ దుబాసి లలిత-మల్లేష్, బిజెపి దళిత రాష్ట్ర నాయకులు వెంకటరమణ, సీనియర్ బిజెపి నాయకులు వడ్డేపల్లి రామచందర్, మామిడి రాజేష్, సుల్వ లక్ష్మీనర్సయ్య, అమరేశ్వరరావు, మంచి కట్ల బిక్షపతి, కోదాటి ప్రవీణ్, నీరటి శ్రీనివాస్, అజీం తదితరులు పాల్గొన్నారు.