(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 15: హైదరాబాద్ నగరం సెంట్రల్‌జోన్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటి సభ్యులు మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి కమలాసన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. కరీంనగర్ కమిషనరేట్ మొదటి కమిషనర్‌గా భాద్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో చేపట్టిన వివిధ రకాల సంస్క రణలతో దేశవ్యాప్తంగా గుర్తింపు లభించినందుకు గాను కమిషనర్‌ను ఆ కమిటి సభ్యులు సన్మానించారు.
కమిషనరేట్‌లోని సిటి పోలీస్ శిక్షణ కేంద్రం(సిపిటిసి)లో 35ఎకరాల విస్తీర్ణంలో మొక్కలను పెంచడం అవినేడు వృక్షాలుగా మారడం, మియావాకి పద్దతిలో చిట్టడవుల పెంపకాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా యాదాద్రి మోడల్‌ఫారెస్ట్‌ను అమలుచేయడం, పోలీసుల దేహధారుఢ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో జిమ్ ఏర్పాటు, నిజాం హాయాంలో నిర్మించిన గోల్ బంగ్లాను అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించి, పచ్చిక బయళ్ళు, వాటర్‌ఫౌంటేన్ల ఏర్పాటుతో ఆహ్లాద వాతావరణం కలిగేలా తీర్చిదిద్ది అతిధులకు లాంజ్‌గా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను నిర్వహించినందుకుగాను తాము ఈ సత్కారం చేస్తున్నామని కమిటి సభ్యులు తెలిపారు. సిపిటిసిలోని మియావాకి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మొక్కలపెంపకం కోసం తీసుకున్న జాగ్రత్తలు కమిషనర్ వి.బి కమలాసన్‌రెడ్డికి వివరించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌సిటి సెంట్రల్‌జోన్ పీస్‌అండ్‌వెల్ఫేర్ కమిటి అధ్యక్షులు శశికాంత్ అగర్వాల్, సభ్యులు డాక్టర్ జైనుల్లాహ్ బేదిన్‌ఖాన్, తరుణ్ తుల్సియాన్, నవీన్‌కుమార్ అగర్వాల్, కొంజర్ల వెంకన్న, దీపక్‌చందానీ, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.