Home తెలంగాణ నిండుకుండల్లా ప్రాజెక్టులు

నిండుకుండల్లా ప్రాజెక్టులు

549
0
Wataer discharged
Water discharged from LMD gates to bootom

తెరుచుకున్న గేట్లు
గోదావరి, మానేరుకు జలకళ

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్‌, సెప్టెంబర్‌ 15: జోరుగా వానలు కురుస్తుండడంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నిండుకుండల్ల మారడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలేస్తున్నారు. దీంతో గోదావరి మానేరు నదులు పొంగిపొర్లుతున్నాయి. వాగులు వంకలు నిండుగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్‌, శ్రీరాజరాజేశ్వర పాజెక్టు (మిడ్‌మానేరు) లోయర్‌ మానేరు డ్యాం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. వరదకాలువ, కాకతీయ కాలువలు నీటితో నిండుదనం సంతరించుకున్నాయి. ఎస్సీరెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతీ సరస్వతీ, లక్ష్మీ బ్యారేజీల గేట్లుకూడా ఎత్తి దిగువ గోదావరికి వేలాది క్యూసెక్కుల నీటిని వదిలివేస్తున్నారు.

లోయర్‌ మానేరు డ్యాం

లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండి) నీటి నిలువ సామర్థ్యం 24 టిఎంసీలు కాగా ఇప్పటికి ప్రాజెక్టులోకి 23.6 టిఎంసీల నీరు వచ్చి చేరింది. మోయతుమ్మెద వాగు నుండి 31,742 క్యూసెక్కుల వదర నీరు వచ్చి చేరుతుంది. అలాగే మధ్య మానేరు నుంచి 14,466 క్యూసెక్కుల వరద వచ్చి ఎల్‌ఎండీలోకి చేరుతుండంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ప్రాజెక్టుకు ఉన్న 20 గేట్లను ఎత్తి 47.437 వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేరులోకి వదిలారు. మరో రెండు వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువ ద్వారా వదులున్నారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో పూర్తిస్థాయికి నీరు చేరుకున్నది. ప్రాజెక్టులోని ఎగువ నుంచి 1,24,354 క్యూసెక్కుల వదర నీరు వస్తోంది. ఎస్సారెస్పీ నీటి సామర్థ్యం 90.315 టిఎంసీల నీరు రావడంతో 25 గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. వరదకాలువ ద్వారా 10,371 క్యూసెక్కుల నీటిని మిడ్‌ మానేరులోకి వదిలారు.

శ్రీరాజరాజ్వేర ప్రాజెక్టు

శ్రీరాంసాగర్‌ నుంచి వరద కాలువ ద్వారా నీటిని వదలడంతో శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌ (మిడ్‌ మానేరు) నిండు కుండలా మారింది. దీని నీటి నిలవు సామర్థ్యం 27.5 టిఎంసీలు కాగా 25.4 టిఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టుకు 23.929 క్యూసెక్కుల వరద ఇన్‌ప్లో కొనసాగుతుండగా గేట్లను ఎత్తివేసీ 8.248 క్యూసెక్కుల నీటిని ఎల్‌ఎండీకి వదిలారు.

CP Supervised
CP supervised the provision

ఎల్‌ఎండి వద్ద బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్‌ కమిషనర్‌

మంగళవారంనాడు లోయర్‌ మానేరు డ్యాం(ఎల్‌యండి) అన్నిగేట్లను తెరిచి నీటిని వదులుతుండటంతో ఒక్కసారిగా సందర్శకుల తాకిడి పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి ప్రత్యక్షంగా బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అన్నిస్థాయిలకు చెందిన పోలీసు అధికారులకు వివరించారు. భద్రతాచర్యల్లో భాగంగా ఈ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఈ బందోబస్తు పర్యవేక్షణ చర్యల్లో అడిషనల్‌ డిసిపి(పరిపాలన) జి చంద్రమోహన్‌, టౌన్‌ ఏసిపి అశోక్‌నగరంలోని ఎన్స్‌పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here