– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 30: కాంట్రాక్టు కార్మికులకు ఎల్లవేళల అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సింగరేణి ఆసుపత్రిలోని కాంట్రాక్టు కార్మికులు ఎమ్మెల్యేను సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… సింగరేణి ఆసుపత్రిలో కరోనా సమయంలో ప్రాణాలు సైతం లేక్కచేయకుండా విధులు నిర్వహించిన వారికి 2 నెలల వేతనంతో పాటు ఇన్సెంటీవ్‌ను జిఎంతో మాట్లాడి ఇప్పించడం జరిగిందన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ఏ కష్టం వచ్చిన తాము ఆసరా ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, తెలంగాణ కాంట్రాక్టు సంఘం నాయకులు మద్దెల శ్రీనివాస్, ఎరుకల నాగరాజుతో తదితరులు పాల్గొన్నారు.