Home తెలంగాణ కార్మిక వర్గంపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టండి

కార్మిక వర్గంపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టండి

398
0
Vardhanthi Sabha
Kumaraswamy 29th Vardhanthi Sabha

– కార్మిక వర్గానికి ఐఎఫ్‌టియు పిలుపు

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్‌ 30: కార్మిక వర్గంపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలని ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి ఐ కృష్ణ అన్నారు. స్థానిక ఐఎఫ్‌టియు కార్యాలయంలో గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం (జీఎల్‌బీకేఎస్‌), ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దివంగత కుమారస్వామి 29వ వర్ధంతి సభ బుధవారం నిర్వహించారు. కుమారస్వామి చిత్రపటానికి పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా జీఎల్‌బీకేఎస్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి ఐ.కష్ణ మాట్లాడుతూ కుమారస్వామి కార్మిక హక్కుల సాధనకై పీడిత ప్రజల సమస్యల పరిష్కారానికై జరిగిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు. విప్లవోద్యమ నిర్మాణ క్రమంలో కేసులను తట్టుకొని కార్మికవర్గం కోసం నిబద్ధతతో నిలబడ్డారన్నారు.

బొగ్గుగని కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు సింగరేణి యాజమాన్యం పై పోరాటాలు చేసిన చరిత్ర కుమారస్వామిది అని పేర్కొన్నారు. ఆయన ఎదుగుదల ఓర్వలేక అతివాద, అరాచక శక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు.టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి తుంగలో తొక్కిందన్నారు. కార్మిక వర్గాన్ని మరోసారి భ్రమల్లో దింపేందుకు గుర్తింపు సంఘం, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఈ.నరేష్‌ తోకల రమేష్‌, మల్యాల దుర్గయ్య, సిహెచ్‌ అబేద్నేగో, ఎం.కొమురయ్య, ఎండి ఈసుబ్‌, జి.ప్రసాద్‌, బి.శ్రీధర్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here