Home తెలంగాణ రక్షణ పరికరాల వినియోగోత్సవాలు

రక్షణ పరికరాల వినియోగోత్సవాలు

367
0
Pledge with employees
Pledge with employees

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్‌ 15: సింగరేణి ఆర్‌జీ-1 పరిధి జీడీకే.11వ గని వ్యక్తి గత రక్షణ పరికరాల వినియోగ ఉత్సవాలు గురువారం నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ నుంచి 24వరకు వ్యక్తి గత రక్షణ పరికరాల వినియోగ ఉత్సవాలు జరుగు తున్నాయి. అందులో భాగంగానే జీడికే 11వ గ్రూప్‌ ఏజెంట్‌ ఏ. మనోహర్‌ ఆద్వర్యంలో రక్షణ అవగాహన సదస్సు చేపట్టారు. రక్షణ పరికరాల పక్షోత్సవాలను పురస్కరించుకొని ఉద్యోగులతో ప్రతిజ్ణ చేపించారు.  ఈ సందర్భంగా ఉద్యోగులకు రక్షణ పరికరాల వినియోగం, రక్షణ సంబంధిత సూత్రాలను వివరించటం జరిగింది.

ప్రతి ఒక్కరూ అండర్‌ గ్రౌండ్‌లో తప్పని సరిగా రక్షణ సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వ హించాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రికల్‌ పనులు చేసేటప్పుడు తప్పని సరిగా సరైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరు తప్పని సరిగా సేఫ్టీ క్యాప్‌, క్యాప్‌కు చిన్‌ స్టాప్‌ తప్పని సరిగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. షూస్‌ తప్పని సరిగా వాడాలని, రక్షణతో కూడిన పనులను చేయాలని, నిర్లక్షంతో విధులని నిర్వహించకూడదని ఏజెంట్‌ మనోహర్‌ తెలిపారు.

Agent Manohar explaining the use of safety equipment and safety principles to employees
Agent Manohar explaining the use of safety equipment and safety principles to employees

ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్‌ రమేశ్‌బాబు, వెంటిలేషన్‌ ఆఫీసర్‌ జాన్సన్‌, షిఫ్ట్‌ ఇంచార్జ్‌లు ఇతర అదికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here