(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 12: అర్జీ-1 ఏరియాలోని జిడికే 11 ఇంక్లైన్ డైరెక్టర్ (ఆపరేషన్స్ & పా) ఎస్.చంద్రశేఖర్ సందర్శించారు. ఉత్పత్తి మరియు ఉత్పాదకతకు సంబందించి జియం కె నారాయణ, గని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిడికే 11 ఇంక్లైన్ గని అన్ని సీములకు సంబందించిన పని స్థలాలు, బొగ్గు ఉత్పత్తి ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్బంగా డైరెక్టర్ మాట్లాడుతూ అర్జీ-1 ఏరియా కు సంబందించిన ఉత్పత్తి మరియు ఉత్పాదకత లక్ష్యాలను సాధించాలని తెలిపారు.
కంటిన్యూస్ మైనర్ ను 1 సిమ్ లోకి తిరిగి పంపిచుటకు సంబందించిన దారులను మరియు గని లోని ఇతర ప్రదేశాలకు సంబందించిన మ్యాప్ లను పరీక్షించారు. కంటిన్యూస్ మైనర్ ఓవర్ హాలింగ్ చేసి 1 సిమ్ లోకి పంపించి బొగ్గు ఉత్పత్తిని వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉద్యోగులు అందరూ సమిష్టిగా పనిచేసి ఉత్పత్తిని సాధించాలని సూచించారు.
రక్షణ చర్యలను పాటిస్తూ ఉత్పత్తి మరియు ఉత్పాదకత పనులను వేగవంతంగా చేపట్టాలని జియం కె నారాయణ మరియు ఏజెంట్ మనోహర్ లకు సూచించారు. కంటిన్యూస్ మైనర్ ఓవర్ హాలింగ్ పనులు పూర్తి చేసి 16వ తేదీ లోపు అండర్ గ్రౌండులోని పంపుటకు ప్రణాళికలు సిద్దం చేశామని జియం కె.నారాయణ డైరెక్టరుకు వివరించారు.
ఈ కార్యక్రమంలో గని మేనేజర్ నెహ్రూ, అండర్ గ్రౌండు మైన్స్ హెడ్ (జెమ్ కొ)ఎం.డి.సురేశ్ కుమార్, గ్రూప్ ఇంజనీరు రాందాస్, సర్వే అధికారి నారాయణ, జెమ్ కొ ప్రాజెక్ట్ మేనేజర్ నరసింహారావు, సెక్యూరిటి అధికారి వీరారెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.