– ధనబలంతో అధికారం కోసం వివేక్ అరాటం
– స్థానికుల ఉద్యోగాలను అడ్డుకుంటున్న సోమారం
– పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేతకాని
(ప్రజాలక్ష్యం విలేకరి – రామగుండం నియోజకర్గం)
గోదావరిఖని, సెప్టెంబర్ 12: రామగుండం ఎరువుల కర్మాగారంలో తమ భూములను కోల్పోయిన వీర్లపల్లి, లక్ష్మీపూరం గ్రామాల ప్రజలకు నాయ్యం జరిగేలా, స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకై పార్లమెంట్ లో ప్రస్తావించి స్థానికులు ఉద్యోగాల సాధనకు కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేతకాని అన్నారు. శనివారం రామగుండం ఎరువుల కార్మాగారం ఎదుట పెద్దఎత్తున నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలిసి పాల్గొన్నారు. కేంద్ర మంత్రులను అడ్డుకుని తమ నిరసన తెలిపారు.
అనంతరం ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేతకాని మాట్లాడారు తెలంగాణ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కర్మాగారంలో 11 శాతం పెట్టుబడులు పెట్టడం జరిగిందన్నారు.స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు కల్పిస్తూ ఈ ప్రాంత ప్రజలకు ఆర్.ఎఫ్.సి.ఎల్ యాజమాన్యం మెండి చేయ్యి చూపించారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు మాటాలతో ప్రజల దృష్టి మల్లించెందుకు చూస్తున్నారన్నారు.
రామగుండంలో భాజపా నాయకుల దుర్మార్గాలు మితిమీరిపోతున్నాయని, ధనబలంతో మాజీ ఎంపి వివేక్ అధికారం కోసం అరాట పడుతున్నారని విమర్శించారు. భాజపా నాయకులు స్థానికులకు ఉద్యోగాలు కల్పన కోసం పాటుపడాలని అలా కాకుండా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అవినీతికి పాల్పడుతూ స్థానికులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నారన్నారు. రాబోవు కాలంలో ప్రజలు వీరికి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగాలు సాధించే వరకు విశ్రమించేదిలేదన్నారు.