Home తెలంగాణ జిల్లా సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

జిల్లా సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

692
0
Psychologists Association
Newly elected District Psychologists Association Committee

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని అక్టోబర్‌ 19: తెలంగాణ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ పెద్దపల్లి జిల్లా శాఖను నూతనంగా ఏర్పాటు చేసారు. స్థానిక మార్కండేయకానీలోని రెయిన్‌బో ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన సమావేశంలో తొలి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మేజిక్‌ రాజా, ఉపాధ్యక్షుడుగా జి.భూమయ్య, బైరి వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శిగా మీసా ప్రణయ్‌, సంయుక్త కార్యదర్శిగా పద్మజ చెలికల, కోశాధికారిగా షైనాజ్‌ బేగం, కార్యవర్గ సభ్యులుగా గోదారి సంతోష్‌, దివ్యశ్రీను ఎన్నుకున్నారు.

సైకాలజీలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు, సామాజిక చైతన్యం కోసం కార్యక్రమాలను రూపొందించాలని నూతనంగా ఎన్నికైన కార్యవర్గం  నిర్ణయించింది. కాగా నూతన కార్యవర్గానికి సంస్థ రాష్ట్ర అధ్యక్షు డా.మోతుకూరి రాంచందర్‌, స్మైల్‌ ప్లీజ్‌ లాఫింగ్‌ క్లబ్‌, నియర్‌ అండ్‌ డియర్‌ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్‌, రామగుండం కళాకారు సంక్షేమ సంఘం సభ్యులు అభినందనలను తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here