(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని అక్టోబర్ 2 : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జాతిపిత మహత్మాగాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహనీయుల ఆశయాల బాటలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి అగ్రగణ్యు లన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ, దివంగత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఉయద్ కుమార్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీపీసీ-రామగుండం:
మహాత్మాగాంధీ 151వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీపీసీ సిజిఎం సునీల్ కుమార్, సీనియర్ అధికారులు, యూనియన్ల ఆఫీసు బేరర్లు, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ.. గాంధేయ ఆలోచన గురించి వివరించారు.
టీఆర్‌ఎస్ పట్టణ సమన్వయ కమిటి:
గాంధీ జయంతి సందర్భంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గల బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు. పార్టీ సీనియర్ నాయకులు దీటీ బాలరాజు, చెరుకు బుచ్చిరెడ్డి, చల్లగురుల మొగిలి, నారాయణదాసు మారుతీ, తోడేటి శంకర్ గౌడ్, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, పిటి స్వామి , బొడ్డు రజిత రవీందర్, మండ రమేష్, మేకల పోషం, సన్నీ, రాజు గౌడ్ పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో:
స్థానిక శివాజీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ హాజరై గాంధీ, శాస్త్రీ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించారు. బీజేపీ నాయకులు రావుల రాజేందర్, క్యాతం వెంకటరమణ, రవీందర్ మామిడి రాజేష్, రేణుక, వెంకటేష్ దేవకరణ, పిడుగు క్రిష్ట, దుబాసి మల్లేష్,రాచకొండ కోటీశ్వరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ అధ్వర్యంలో:
స్థానిక చౌరస్తాలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ హజరై మహత్మ గాంధీ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళ్లు అర్పించారు. అనంతరం లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు, నాయకులు కాల్వ లింగస్వామి, దొంతుల లింగం, మహంకాళి స్వామి, యండి ముస్తాఫా, గాదం విజయ, పెద్దపల్లి ప్రకాష్ నగూనురి రాజు, గట్ల రమేశ్, నజీమొద్దిన్, చిప్ప రాజేష్, యుగెందర్, నాయిని ఓదేలు, కొప్పుల శంకర్, అనుమ సత్యనారాయణ, పీక అరుణ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.
సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో:
ప్రధాన చౌరస్తాలో గాంధీ జయంతి పురస్కరించుకుని సీనియర్ సిటిజన్ అధ్యక్షులు పిటి స్వామి హాజరై గాంధీ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. నూరేళ్ళ వెంకటేశం, గంట సత్తయ్య, జై హింద్, లింగమూర్తి, వెంకటేశ్వరరావు, బొజ్జ రాజు, పరమేశ్వరయ్య, అధిక సంఖ్యలో సీనియర్ సిటిజన్ నాయకులు పాల్గొన్నారు.
ఎన్‌వైపీ ఆధ్వర్యంలో:
నేషనల్ యూత్ ప్రాజెక్టు (ఎన్‌వైపీ), సంకల్ప, ఏకతాపరిషత్ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డగుంటపల్లిలోని శ్రీరామవిద్యానికేతన్ పాఠశాలలో చేపట్టగా, యూత్ రాష్ట్ర అధ్యక్షులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం గాంధీ, శాస్త్రీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు ఎస్.నారాయణ, న్యాయవాది ఎం.డి.అన్వర్, తారా ఆర్ట్స్ అకాడమి చైర్మన్ సంకె రాజేష్, దామెర శంకర్, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక టీఎన్‌టీయుసి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అనుబంధం సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలవేశారు. రాష్ట్ర టి.యన్.టి.యు.సి ప్రధాన కార్యదర్శి కంది చంద్రయ్య, నాయకులు బైరం శంకర్, ఏలేశ్వరం చంద్రమౌళి, గుండెబోయిన ఓదెలు, అరికెల బాబు, అనుమ రాయమల్లు పాల్గొన్నారు