– పేద ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
– ఈటెలకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జమ్మికుంట, ఆక్టోబరు 11. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం తధ్యమని, అతని గెలుపు నల్లేరుపై నడకేనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. నియోజవర్గంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 2 వ వార్ఢులో గడప గడపకు గులాబీ సైన్యంతో మంళవారం ఇంటింటా ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ భాద్యతలు తీసుకున్ననాటి నుండి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను విజయ వంతంగా అమలు చేస్తున్నరని… ప్రజల సంక్షేమంతో పాటు ప్రతి ముఖాల్లో అనందం నింపడమే లక్ష్యంగా పాలన సాగిస్తు న్నారని తెలిపారు.
ఈటల రాజేందర్ కు రాజకీయ జన్మనిచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా ఈటెల రాజేందర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తే టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని, తిన్నింటి వాసాలు లెక్కించే విధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు..
సామాన్య కుటుంబంలో పుట్టిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఓటు వేయాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రుణం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని హుజురాబాద్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు నల్లేరుపై నడకే అన్నారు.
సిఎం కేసీఆర్ పాలనలో పేద వారికి ఆడపిల్ల భారం కావద్దని ఆడపిల్ల పుడితే 13వేలు, కేసీఆర్ కిట్, ఉచితంగా విద్యతో పాటు ఆడబిడ్డల వివాహాల కోసం కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ పథకం ద్వారా 1లక్ష116 రూపాయలు అందిస్తూ భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సయమంలో కుడా పేద ప్రజలు ఇబ్బందులు పడవద్దని సంక్షేమ పథకాలను అమలు చేసిన పేదల పక్షపాతి సీఎం కేసీఆరేనని అన్నారు.
దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. రైతన్నాకు 24 గంటల ఉచిత కరెంట్ రైతుభీమా రైతు బంధు సకాలంలో ఎరువులు అందించి వెన్నుముక సిఎం గారు నిలిచారన్నారు. పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన రైతు బంధవు కేసీఆర్ అని తెలిపారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల ఆభ్యున్నతికై దళిత బంధు పధకాన్ని అమలు చేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. రాష్ట్రంలోని సకల వర్గాల సంక్షేమానికి అహర్నిషలు పడుపడుతున్న సీఎం కేసీఆర్ కు మద్దతుగా నిలువాలని కారు గుర్తుకు ఓటువేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ బిక్షపతి సర్పంచ్ ధర్మాజీ కృష్ణ నాయకులు దేవేందర్ రెడ్డి తోడేటి శంకర్ గౌడ్ పసూల బాబు రామస్వామి రాజు రాజేశం సదానందం ఎల్లయ్య సంజీవ్ రవి రాజేందర్ శ్రీధర్ నాగరాజు వెంకటేష్ అశోక్ మణికంఠ అజయ్ గణపతి తదితరులు పాల్గొన్నారు