(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరఖని సెప్టెంబర్ 5: రామగుండం నియోజవర్గం అంతర్గాం మండలంలో ఐటి మరియు ఇండ్రస్టీయల్ పార్కు నిర్మాణానికి రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమీషనర్ (సిసిఎల్ఏ) ద్వారా భూపరిపాలన అనుమతులు ఇప్పించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లో మంత్రి కేటిఆర్ కలసి ఎమ్మెల్యే వినతిపత్రం అందించారు. రామగుండం నియోజవర్గంలోని అంతర్గాం మండల కేంద్రంలో సుమారు వంద ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన ఇండ్రస్టీయల్ పార్కు కోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందని మంత్రికి తెలిపారు. ఇండ్రస్టీయల్ పార్కు ఏర్పాటుతో రామగుండం నియోజవర్గంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రికి విన్నవించినట్లు తెలిపారు. భూపరిపాలన అనుమతుల కోసం సంబంధిత అధికారులను అదేశించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి కేటిఆర్ సానుకులంగా స్పందించారని, త్వరలోనే భూపరిపాలన అనుతులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చందర్ తెలిపారు. ఈ సందర్భంగా పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిస్తున్న మంత్రి కేటిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Home తెలంగాణ ఇండష్ర్టియల్ పార్కుకు భూపరిపాలన అనుమతులు ఇప్పించండి – రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్