Home తెలంగాణ మేడిపల్లి ఒపెన్ కాస్ట్ ను సందర్శించిన మైనింగ్ అడ్వైజర్

మేడిపల్లి ఒపెన్ కాస్ట్ ను సందర్శించిన మైనింగ్ అడ్వైజర్

518
0
Visiting
Mining Adviser visiting Medipalli Opencast

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని పెప్టెంబర్ 7: ఆర్జీవన్ ఏరియాలోని మేడిపల్లి ఒపెన్ కాస్ట్ ను సోమవారం రోజున మైనింగ్ అడ్వైజర్ (ప్రాజెక్ట్స్డి) డి.ఎన్. ప్రసాద్ సందర్శించారు. ఒవర్ బర్డెన్ తరలింపు పనులను,  బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను పెంచాలని, తదితర విషయాల గురించి జియం కె. నారాయణను అడిగి తెలుసుకున్నారు. రక్షణ చర్యలను పాటిస్తూ ఉత్పత్తి మరియు ఒవర్ బర్డెన్ తరలింపు పనులను చేపట్టాలని సూచించారు. అలాగే మిగిలి ఉన్న బొగ్గు సీముల వివరాలు, ఆ సీముల నుండి బొగ్గు రవాణా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం జిడికే 2 ఇంక్లైన్ పక్కన గల నూతన నర్సరీని సందర్శించి అక్కడ మొక్కల పెంపకం వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలను నాటారు. అలాగే సింగరేణి లోనే మొదటి సారిగా అర్జీ-1 ఏరియా లో 17 సంవత్సరాల నాటి మహా వృక్షాలను ట్రాన్స్ ప్లాంటేషన్ పద్దతి ద్వారా నాటిన విధానం చూసి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంత భారీ వృక్షాలు ట్రాన్స్ ప్లాంటేషన్ పద్దతి ద్వారా నాటటం గొప్ప విషయం అని అన్నారు. జీడికే.5 ఉపరితల గనికి సంబందించిన నాళాలు పనులు మరియు రోడ్లు డైవర్షన్ పనులు స్వయంగా పర్యవేక్షించారు. ఆ తర్వాత పాత నర్సరీ వద్ద నిర్మిస్తున్న ఫీడర్ (బేకర్ మరియు కోల్ ట్రాన్స్ పోర్ట్ బంకర్ పనులను పర్యవేక్షించి వాటి వివరాలను జియంను అడిగి తెలుసు కున్నారు.

ఈ కార్యక్రమంలో అర్జీ-1 ఏరియా జియం కె నారాయణ, మేడిపల్లి పి.ఒ సత్యనారాయణ, మేనేజర్ గోవిందా రావు, సర్వే అదికారి అలీ, పర్సనల్ మేనేజర్ రమేశ్, సెక్యూరిటి అధికారి వీరారెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here