(ప్రజాలక్ష్యం కోల్‌బెల్ట్ ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 15: పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆర్‌జీ-3 పరిధిలో కారుణ్య నియామకాల ద్వారా డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించినట్లు జీఎం కె.సూర్య నారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీబీజీకేఏస్ ఉపాధ్యక్షులు గౌతం శంకరయ్య చేతుల మీదుగా కారుణ్య నియామకాల ఉత్వర్వులను అభ్యర్థులకు అందించారు. ఈ కార్యక్రమానికి జీఎం కె.సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా జియం మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తూ వివిధ ఆనారోగ్య కారణాలతో మెడికల్ ఇన్‌వాలిడేషన్ పొందిన ఉద్యోగుల వారసులకు సంస్థలో ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. క్రమశిక్షణతో ఉద్యోగ విధులు నిర్వహిస్తూ సింగరేణి సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఉద్యోగ అవకాశాలు పొందుతున్న వీరంతా ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగు పరుచుకొనుటకు విటిసిలో శిక్షణ తీసుకోవాలన్నారు. సంస్థ సీనియర్ ఉద్యోగుల వద్ద పనితనపు మెళవకులు నేర్చు కోవాలన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి దోహదపడి సంస్థ పురోభివద్ధికి పాడుపడాలని సూచించారు. సర్వీసులో వున్న కాలంలో మైనింగ్ పరీక్షలు రాసి ఉన్నత స్థాయిక ఎదగాలన్నారు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కృషి, యూనియన్ నాయకులు ప్రోద్బలంతోనే కారుణ్య నియామకాలు సింగరేణిలో అమలవుతున్నాయని టీబీజీకేఏస్ ఉపాధ్యక్షులు గౌతం శంకరయ్య పేర్కొన్నారు. కారుణ్య రూపంలో ఉద్యోగాలు పొందిన వారు మంచి నడవడికతో విధులు చేపట్టి, కుటుంబాన్ని పోషించుకోవాలని శంకరయ్య సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ పర్సనల్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.