Home తెలంగాణ సింగ‌రేణిలో 36 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు…

సింగ‌రేణిలో 36 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు…

975
0
RG-I GM K.Narayana issue recruiting order to Dependents
RG-I GM K.Narayana issue recruiting order to Dependents

– నియామ‌క‌పు ప‌త్రాల‌ను అంద‌జేసిన ఆర్జీవ‌న్ జియం కె. నారాయ‌ణ‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబ‌ర్ 16: సింగరేణి ఆర్జీవన్‌ ఏరియాలో కారుణ్య నియామకాల ద్వారా 36 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించినట్లు జియం కె.నారాయణ తెలిపారు. ఈ మేరకు బుధ‌వారం రోజున జియం కార్యాలయంలో నియామక ఉత్తర్వులను డిపెండెంట్లకు అంజేశారు.

ఈ సందర్బంగా జియం కె. నారాయణ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తూ వివిధ ఆనారోగ్య కారణాలతో ఉద్యోగుల వారసులగు 36 మందికి సంస్థలో ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. చాలా తక్కువ సమయంలో 32 మందికి మెడిక‌ల్ ఇన్‌వ్యాలిడేష‌న్‌, డెత్‌ ద్వారా 4గురికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. వీరందరికి శ్రీ‌రాంపూర్ ఏరియాలో పోస్టింగ్‌ ఇవ్వటం జరిగిందని తెలిపారు.

G.M. K. Narayana with candidates who got dependent jobs in Singareni.
G.M. K. Narayana with candidates who got dependent jobs in Singareni.

ఉద్యోగ అవకాశాలు పొందుతున్న వీరంతా ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగు పరుచుకొనుటకు విటిసిలో శిక్షణ తీసు కోవాలన్నారు. సంస్థ సీనియర్‌ ఉద్యోగుల వద్ద పనితనపు మెళవకులు నేర్చు కోవాలన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి దోహదపడి సంస్థ పురోభివృద్ధికి పాడుపడాలని సూచించారు.

ఈ కార్యక్ర‌మంలో ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ య‌స్‌. ర‌మేష్‌, డిప్యూటి ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ స‌మ్మ‌య్య‌,  జియం ఆఫీస్ ఇంచార్జ్ ప్ర‌వీణ్‌, సెక్యూరిటీ ఆఫీస‌ర్ వీరారెడ్డి, మ‌ల్లీశ్వ‌రి మ‌రియు అభ్య‌ర్థులు ప‌ల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here