– తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ కబళించేందుకు కుట్ర
– అబద్ధపు, గ్లోబల్ ప్రచారాలను తిప్పికొడతాం
– రాష్ట్ర సంక్షేమశాఖామాత్యులు కొప్పుల ఈశ్వర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 17: గ్రేటర్ హైదరాబాద్ మన్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేద్దామనని రాష్ట్ర సంక్షేమశాఖామాత్యులు కొప్పుల ఈశ్వర్ పిలుపు నిచ్చారు. మంగళవారం ఎన్టీపీసీ శ్రీ లక్ష్మీ నరసింహా గార్డెన్లో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది తెరాస పార్టీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కేసీఆర్‌కు ప్రజల గుండెల్లో నెలకొన్న సుస్ధిర స్దానం లోకానికి మరోమారు చాటుదామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కబళించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, కారోనా సమయంలో హైదరాబాద్ వరదల సమయంలో కేంద్రం ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై సవతి ప్రేమను చూపిస్తుందన్నారు.
ఇటీవల దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలను గందరగోల పరిచేలా గోబెల్ ప్రచారం చేశారన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందాలనే దురుద్దేశంతో అనేక తప్పుడు, అబద్దపు ప్రకటనలు చేశారని ఆయన విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు ఎన్నో అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా చేపట్టి రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి రాష్ట్రంగా గుర్తింపు తెచ్చిన విషయాలను జిహెచ్‌ఎంసీలో ప్రజలకు వివరించా లన్నారు. రామగుండంకు ప్రచార బాధ్యతలు ఇచ్చిన మల్కాజీగిరిలో టిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకు శ్రేణులు శక్తి వంచన లేకుండా పనిచేయాలని కోరారు.
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన గురించి వివరిస్తూ, ప్రతిపక్షాల వైఫల్యాలను విడమర్చి చెబుదామని అన్నారు. మహోన్నత నాయకులు కేసీఆర్ అహింసా పద్ధతుల్లో మహోద్యమాన్ని నడిపి ప్రజల చిరకాల కోరిక అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. కెసిఆర్ ”దీక్షా” దక్షతలు, త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఎన్నో కష్టనష్టాలు, ఆటుపోట్లు, చేదు అనుభవాలు చూశామన్నారు. మన మందరం అంకితభావంతో ముందుకు సాగతూ కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేద్దామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న బంధువులు, స్నేహితులను కలిసి కారుగుర్తుకు ఓటేసీలా ప్రచారం చేయాలన్నారు. మల్కాజీగిరిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించారన్నారు. మనంతా కలిసికట్టుగా పనిచేసి టిఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, జడ్పీటీసీ ఆముల నారాయణ, కందుల సంధ్యారాణి, ఎంపీపీ దుర్గం విజయ, కార్పోరేటర్లు సాగంటి శంకర్, కుమ్మరి శ్రీనివాస్, బాల రాజ్, కుమార్, శంకర్ నాయక్, రమణారెడ్డి, జనగామ కవిత సరోజీని, పొన్న విద్య, నాయకులు మిర్యాల రాజిరెడ్డి, గండ్ర దామెదర్ రావు, పాతపెల్లి ఎల్లయ్య, బోడ్డు రవీందర్, నీల గణేష్, తిరుపతి, రాకం వేణు, జేట్టి రమేష్, కో ఆప్షన్ సభ్యులు దివాకర్, గౌస్ పాషా, కుమ్మరి శారదా తదితరులు పాల్గొన్నారు