– పోతనకాలనీ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం
– కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
– ప్రజల ప్రయాణ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 17ః గత ఎన్నికల్లో పోతనకాలనీ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతామని ఇచ్చిన హామీ మేరకు దాన్ని అమలుపరుస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం 18వ డివిజన్ పోతనకాలనీ వద్ద 8 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జి, రోడ్డు నిర్మాణానికి భూమిపూజచేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత ఎన్నికల ప్రచార సమయంలో 8వ కాలనీ, పోతనకాలనీ, అల్లూరులో పర్యటించిన సందర్భంలో ఈ ప్రాంత వాసులు పోతనకాలనీ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరడం జరిగింది, తాము ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ ప్రాంత వాసులకు ప్రయాణ కష్టాలను శాశ్వతంగా తోలగిస్తానని మాట ఇవ్వడం జరిగిందని, మాట ఇచ్చిన ప్రకారం నూతన బిడ్జి నిర్మాణం పనులు చేపట్టి తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలుపుకున్నామని తెలిపారు.
పోతనకాలనీ, 8వ కాలనీ, అల్లూరు ప్రజలు వర్షకాలంలో బిడ్డిలేక ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని కోల్ బెల్ట్ మ్మెల్యేల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, సింగరేణి సిఅండ్ ఎండి శ్రీధర్ విన్నవించి బిడ్జినిర్మాణం చేయాలని కోరడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రిని ఓప్పించి సింగరేణి సిఆండ్ ఎండి శ్రీధర్ ద్వారా 8 కోట్ల రూపాయలు నిధులు బిడ్జి నిర్మాణానికి వెచ్చించేలా కృషి చేశామ న్నారు. కార్మికుల, ప్రజల సమస్యల పరిష్కరమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు.
పోతనకాలనీలో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తితే అసుపత్రి అందుబాటులో లేదని, ఇక్కడ డిస్పెన్సరితో పాటు మార్కెట్ నిర్మాణం సింగరేణి సంస్థ చేపట్టాలని కోరామని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, ఆర్జీ 2 జిఎం సురేష్, ఎజిఎం సాంబయ్య, కార్పోరేటర్లు తాళ్ల అమృతమ్మ-రాజయ్య, బాదె అంజలి-భూమయ్య, శంకర్ నాయక్, టిబిజికెఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, దుర్గం రాజేశ్,
గోపాల్ రావు, కాటం రాజిరెడ్డి, కుమార్ నాయక్, సారయ్య నాయక్, పులి రాకేష్, మాల్లారెడ్డి, నాగమణి, సంధ్యారెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు.