– సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శంకర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 18: ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందంలు ఆరోపించారు. ఆదివారం స్థానిక భాస్కరరావు భవన్ లో ఏర్పాటు చేసిన సిపిఐ రామగుండం నగర జనరల్ బాడీ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత ప్రజలందరు సంతోషంగా ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పారని, నీళ్లు, నిధులు, నియమాకాలని ప్రగాల్భాలు పలికిన కెసిఆర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రశ్నించే ప్రజాగొంతులను నొక్కుతున్నారని పేర్కొన్నారు.
ఆంధ్ర పాలకులు తెలంగాణను దోచుకుతింటున్నారని ఉధ్యమాన్ని చేపట్టి అధికారంలోకి వచ్చిన తరువాత వారికంటే కేసీఆర్‌రే తెలంగాణను అధికంగా దోచుకుతింటున్నాడని ఆరోపించారు. నీళ్లు తన ఫాంహౌజ్‌లోని పంటలకు, నిధులు తన ఖాతలోకి, నియమాకాలు తన కుటుంబ సభ్యులకు ధారాదత్తం చేస్తున్నాడని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాజ్యహింస మితిమీరిపోతున్నదని, అందులో భాగంగానే వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా నిర్భందించారని తెలిపారు. విమలక్కను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో పలు సమస్యలపై పోరాటాలకు రూపకల్పన చేసి ఉధ్యమాలు నిర్వహించాలని వారు కోరారు.
సిపిఐ నగర కార్యదర్శి కె. కనకరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు గౌతం గోవర్ధన్, గోషిక మోహన్, మడ్డి ఎల్లాగౌడ్, తాళ్లపెల్లి మల్లయ్య, మద్దెల దినేష్, ఎల్. ప్రకాష్ మడికొండ ఓదేమ్మ ,కన్నం లక్ష్మీనారాయణ, కందుకూరి రాజరత్నం టి రమేష్ కుమార్, శనిగరపు చంద్రశేఖర్,ఎజ్జ రాజయ్య, ఎర్రల రాజయ్య, విజయ్, శ్రీకాంత్, జనగామ మల్లేష్ గంగారపు చంద్రయ్య ఆసాల రమ తదితరులు పాల్గొన్నారు.