– అత్యాచారాల కట్టడికి కఠినమైన చట్టాలు తేవాలి…
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని అక్టోబర్ 1: మనీషా మృతికి కారణమైన కామందులను బహిరంగ ఉరి తీయాలని డిహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని చౌరస్తాలో దిష్టి బొమ్మ దహనం చేశారు. గోదావరిఖనిలో సీపీఐ ప్రజాసంఘాల డిహెచ్ పీ ఎస్ ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ హతష్‌లో యువతిపై క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేయడం హేయమని, అత్యాచారాలు అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలయం అయ్యాయని సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కందుకూరి రాజారత్నం పేర్కొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఆగడం లేదన్నారు. నిర్భయ వంటి చట్టాలు తెచ్చినా కామాంధుల వికృత చేష్టలకు అడ్డుకట్ట పడడం లేదన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన మనీషా ఘటన దేశానికే సిగ్గు చేటన్నారు
దేశంలో మోడీ పాలనలో మహిళలకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని అన్నారు. ఇలాంటివి జరగకుండా గల్ఫ్ దేశాల్లో అమలు చేస్తున్న కఠిన చట్టాలు తీసుకరావాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసికా మోహన్, సీపీఐ నగర సహాయ కార్యదర్శి తలపెల్లి మల్లయ్య, ప్రజా సంఘాల నాయకులు ఈ రామచంద్ర, రేణికుంట్ల ప్రీతము, జనగామ మల్లేష్, కనుకరాజ్, శ్రీనివాస్, కుమార స్వామి, చంద్రయ్య, సాగర, సురేష్, రామాస్వమి, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు..