– తెరాసలోకి పలువురి చేరిక
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 15: రాష్ట్ర సమగ్రాభివృద్ధి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, టిఆర్‌ఎస్ పార్టీ జనం గుండెల నిండివుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం కార్పోరేషన్ 9వ డివిజన్ కాంగ్రెస్ కార్పోరేటర్ జనగామ కవిత నరోజినితో పాటు జనగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో తెరాస పార్టీ 14 ఏళ్ల అలుపెరగని పోరాటం ఫలితంగానే ప్రత్యేక తెలంగాణం రాష్ట్రం సిద్ధించిందని, తెలంగాణ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా అహర్నిషలు పాటుపడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకు వచ్చేలా సిఎం కెసిఆర్ కషి చేస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ దేశానికే ఆదర్శ సిఎంగా కెసిఆర్ నిలుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివద్ధి సంక్షేమ పథకాలను అకర్షితులై ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావుతో పాటు కార్పోరేటర్లు దాతు శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు పాతిపల్లిఎల్లయ్య, గడ్డి కనకయ్య, తోడేటి శంకర్ గౌడ్, బొమ్మగాని తిరుపతిగౌడ్, పీచర శ్రీనివాస్, అచ్చ వేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, తోకల రమేష్, ఆడప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టి.ఆర్. ఎస్ పార్టీలో చేరిన వారిలో బొడ్ధు వెంకట్, మహేందర్, శంకర్, మెహన్, నరసింగరావు, శివరామకష్ణ, తదితరున్నారు.