(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్ 15: బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో యూనియన్ అధ్యకుడు కౌశిక హరి సోమవారం జరిపిన చర్చలు సఫిలీకృతం అయ్యాయి. ప్లాంట్ హెడ్ రాజేష్ గార్గ్ హెచ్ఆర్ అండ్ ఐఆర్ గోవిందరావుతో యూనియన్ అధ్యక్షుడు కౌశిక హరి బోనస్ మరియు స్వీట్ల పంపిణి పై చర్చలు జరిపారు. ఈ సంవత్సరం కార్మికులకు రావాల్సిన బోనస్ 34.800/- రెండు దఫాలుగా ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. మొదటి దఫా నవంబర్ 30 లోపు 16.800/- ఇవ్వడానికి అంగీకరించింది. అలాగే దీపావళికి ఇవ్వాల్సిన స్వీట్ నవంబర్ 30 లోపు ఇవ్వాలని కోరగా 30 లోపు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది.
రెండో దఫా బోనస్ 18.000/- రూపాయలు డిసెంబర్ 31 లోపు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది. అలాగే యూనియన్ ఎన్నికల విషయమై కూడా యాజమాన్యంతో చర్చలు జరిగాయి. కోవిడ్ కారణంగా కొన్ని షరతులతో ఎన్నికలు జరపడానికి యాజమాన్యం ముందుకు వచ్చింది. పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించడానికి యాజమాన్యం అంగీకరించింది. కార్మికుల డిమాండ్లను, ఎన్నికల నిర్వహణను అంగీకరించినందుకు కౌశిక హరి యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ తోడేటి రవికుమార్ కమలాకర్ రెడ్డి బాకీ సురేష్ మల్లెతుల శ్రీనివాస్ మల్హర్ రావు విశ్వనాథము నారాయణ జెల్లీ మల్లేష్ ఆనంద్ కాల్వ రాజయ్య బొట్టు శ్రీనివాస్ నాయక్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.