(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్ ఆగష్టు 27: కరోన విపత్కర సమయంలో ఆర్కెస్ట్రా ఈవెంట్స్ పై జీవనోపాధి పొందుతున్న కళాకారులకు నిత్యావసర సరుకులను పంపిణి చేసారు. కేవలం ఆర్కెస్ట్రా ఈవెంట్స్ పై ఆధారపడి బతుకుతున్న నిరుపేద కళాకారులకు అండగా మేమున్నామని తెలంగాణ ఈవెంట్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజున స్థానిక కరీంనగర్ కొండ సత్యలక్ష్మి గార్డెన్‌లో నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ మేయర్ సునీల్ రావు హాజరై నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కరోనా కష్ట సమయంలో కళాకారులను ఆదుకొని నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం గొప్ప విషయమని సంఘ సభ్యులను అభినందించారు. భవిష్యత్తులో ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాను నిర్వహించాలని కోరారు. తదనంతం తెలంగాణ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆసోసియేన్ అధ్యక్షులు డేవిడ్ రాజు మాట్లాడుతూ సంఘం ఉపాధ్యక్షుడు గోగు ప్రసాద్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో మొదటి సారిగా ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆర్కెస్ట్రా ఈవెంట్స్ కళాకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామని తెలిపారు.
మేయర్‌తో ఆర్కెస్ట్రా కళాకారులకు సన్మానం:
తెలంగాణ ఈవెంట్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులకు మేయర్ జ్ఞాపికను అందజేశారు. పలువురి సంఘ సభ్యులను మేయర్ శాలువాతో సత్కరించారు. ఇంకా ఈ కార్య క్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు రేగుల మహేష్ కిరణ్, అభిషేక్, సతీష్, శివ, రమేష్ బాబు, భాను, రాము, రాజశేఖర్ మరియు తదితర కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేగు మహేష్ వ్యాఖ్యానం, ఆయన చేసిన మిమిక్రి ఎంతగానో ఆకట్టుకుంది