Home తెలంగాణ పర్యావరణ రక్షణ కై వినాయక మట్టి విగ్రహాలు పూజించండి – నల్గొండ కలెక్టర్

పర్యావరణ రక్షణ కై వినాయక మట్టి విగ్రహాలు పూజించండి – నల్గొండ కలెక్టర్

560
0
Nalgonda Collector

వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కై మట్టి గణపతి లను పూజించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.జిల్లా యంత్రాంగం తరపున జిల్లా లోని ఏడు మున్సిపల్ పట్టణాలలో 10,000 ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.

10000 మట్టి గణపతి విగ్రహాలు ఉచితంగా పంపిణీ

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హిత మట్టి తో తయారు చేసిన విగ్రహాలను ఏడు మున్సిపాలిటీ లలో నల్గొండ మున్సిపాలిటీ లో 3000, మిర్యాలగూడ మున్సిపాలిటీ లో 2000 విగ్రహాలు, దేవరకొండ, చండూరు,నందికొండ,చిట్యాల, హాలియా మున్సిపాలిటీ లలో ఒక్కొక్క మున్సిపాలిటీ లో 1000 చొప్పున మట్టి విగ్రహాలు ఉచితంగా జిల్లా యంత్రాంగం తరపున మున్సిపల్ కమిషనర్ ల ఆద్వర్యం లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ కై

మట్టి విగ్రహాలు వాడటం వలన చేతి వృత్తుల వారికి పని కల్పించడం తో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడిన వారవుతారని అన్నారు. ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు తీవ్ర జల కాలుష్యం పెరిగి మానవాళికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. పర్యావరణ రక్షణ కు రసాయనాలతో చేసిన విగ్రహాలను తగ్గించి మట్టి విగ్రహాలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృత నిశ్ఛయం తో వుందని అన్నారు.

ఇంటి వద్దనే భక్తి శ్రద్ధలతో

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో వినాయక మండపాలకు అనుమతి లేదని, గణేష్ వుత్సవ నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని, వినాయక చవితి పండుగ ను ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇండ్ల లోనే భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here