తెలంగాణ రాష్ట్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు రేపు అనగా నవంబర్ 10 వ తేదీ ఆదివారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఉదయం 10 గం.లకు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయ సముదాయంలో పునర్నిర్మించిన జిల్లా ట్రెజరీ కార్యాలయం (DTO) ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో పాల్గొంటారని జిల్లా పౌర సమాచార అధికారి తెలియజేశారు.